Viral Video: యముడు లీవ్‌లో ఉన్నాడనుకుంటా భయ్యా..! షాకింగ్ వీడియో వైరల్
Viral Video: పశ్చిమ బెంగాల్ కొండ ప్రాంతంలో భారీ వర్షాల నడుమ బైక్ స్టంట్ చేస్తూ ఓ యువకుడు చావు అంచుల దాకా వెళ్లి బతికాడు.
Viral Video: యముడు లీవ్‌లో ఉన్నాడనుకుంటా భయ్యా..! షాకింగ్ వీడియో వైరల్
Viral Video: దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాల్లో గడచిన కొన్ని రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండప్రాంతాలు, జలపాతాలు, అటవీ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోవడమే కాకుండా రహదారులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. అయినప్పటికీ కొందరు యువకులు వర్షంలో బైక్ రైడింగ్ చేస్తూ, ప్రమాదకరమైన స్టంట్లు వేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని ఒక కొండ ప్రాంతంలో చోటుచేసుకున్న భయానక ఘటన ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. వర్షం పడుతుండగా కొందరు యువకులు బైక్‌లపై వేగంగా కొండపైకి వెళ్తున్నారు. ఆ రహదారి పక్కన ఎటువంటి రక్షణ బారికేడ్లు లేకపోవడంతో తీవ్ర ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఒక బైకర్ అతివేగంగా వెళ్తూ అదుపుతప్పాడు. బైక్ నేరుగా కొండ అంచు వైపునకు దూసుకెళ్లింది. రెప్పపాటు క్షణంలో ఆ యువకుడు తన కాళ్లతో రోడ్డును బ్యాలెన్స్ చేస్తూ బైక్‌ను మరోవైపు తిప్పాడు.
సెకన్ల తేడాలో లోయలో పడిపోకుండా బైక్ నిలవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఈ మొత్తం దృశ్యం వెనుక వస్తున్న మరొక బైకర్ డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డయ్యింది. ప్రమాదం నుండి బయటపడిన ఆ యువకుడు షాక్‌కు గురయ్యాడు. చిన్నపాటి గాయాలతో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో "ఆ యువకుడి లక్ బాగుంది.. యముడు ఎమర్జెన్సీ లీవ్‌లో ఉన్నట్లున్నాడు" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో కొండప్రాంతాలలో రైడింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.