Viral Video: రిస్క్ చేసి మరీ విధులకు.. టైర్ సాయంతో ఈదుతూ నది దాటిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు!
Viral Video: మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలో విధులకు హాజరయ్యేందుకు ఓ ప్రభుత్వ టీచర్ టైర్ సాయంతో నది దాటుతున్న షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.
Viral Video: రిస్క్ చేసి మరీ విధులకు.. టైర్ సాయంతో ఈదుతూ నది దాటిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు!
Viral Video: మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాలు వరద ముంపునకు గురికాగా.. భింద్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
నద్రౌలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రాజేష్ భారతి అనే ఉపాధ్యాయుడు ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలకు, నివాస ప్రాంతాలకు మధ్యలో ఉన్న నది సాధారణ రోజుల్లో ఎండిపోయి ఉన్నప్పటికీ, వర్షాకాలంలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. గ్రామాన్ని పాఠశాలతో అనుసంధానించే వంతెన గానీ, ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం గానీ లేకపోవడంతో టీచర్లు టైర్ల సాయంతో ప్రాణాలకు తెగించి ఈదుకుంటూ నది దాటాల్సి వస్తోంది. ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరైతే జీతాల్లో కోత పడుతుందనే భయంతోనే ఈ ప్రమాదకర సాహసం చేస్తున్నట్లు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై విద్యాశాఖ అధికారి హిమాన్షు ద్వివేది స్పందించారు. అధికారులు ఇప్పటికే ఆ పాఠశాలను సందర్శించారని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తున్నామని వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విధులకు రాలేకపోతే ఉపాధ్యాయుల జీతాల్లో ఎలాంటి కోత విధించబోమని స్పష్టమైన హామీ ఇచ్చారు.