Doctor Blackmail : నర్స్ ప్లాన్‌కు 65 ఏళ్ల డాక్టర్ బలి.. ఒక్కో ఫొటోతో రూ.2 కోట్లు గుంజింది.!
Doctor Blackmail : రాజస్థాన్‌లోని బార్మేర్ జిల్లాలో సినిమా కథను తలపించే సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న మహిళ..
Nurse-Blackmail
Doctor Blackmail : రాజస్థాన్‌లోని బార్మేర్ జిల్లాలో సినిమా కథను తలపించే సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న మహిళ, అదే ఆసుపత్రికి చెందిన 65 ఏళ్ల సీనియర్ డాక్టర్‌ను సీక్రెట్ ఫొటోలతో బెదిరిస్తూ ఏకంగా రూ.2 కోట్లు గుంజిన ఘటన కలకలం రేపుతోంది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేశారు.
టీ సాకుతో గదిలోకి వచ్చి దారుణం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమల అలియాస్ కమలేష్ అనే మహిళ డిసెంబర్ 2016 నుంచి ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లలో పనిచేసే ఈమె, టీ తయారు చేసి ఇస్తాననే సాకుతో డాక్టర్ పర్సనల్ రూమ్‌లోకి తరచూ వచ్చేది. ఈ క్రమంలోనే డాక్టర్‌కు తెలియకుండా ఆయన వ్యక్తిగత ఫోటోలను తన మొబైల్‌లో సీక్రెట్‌గా రికార్డ్ చేసింది. ఆ తర్వాత అసలు రంగు బయటపెట్టి, సదరు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఆయనపై రేప్ కేస్ పెట్టి జైలుకు పంపుతానని , చంపేస్తానని బెదిరింపులకు దిగింది. తన సమాజంలో పరువు, ఆస్పత్రి ఇమేజ్ పోతుందనే భయంతో డాక్టర్ ఆమె అడిగినప్పుడల్లా లక్షల్లో డబ్బులు ఇస్తూ వచ్చారు.
24 గంటలు కాపలా.. వింత డిజిటల్ అరెస్ట్..
నెలకు కేవలం రూ.12,000 జీతం తీసుకునే ఆ నర్స్, డాక్టర్‌ను దాదాపు తన కంట్రోల్‌లో ఉంచుకుంది. ఆయనను ఎప్పుడూ తన నిఘా నీడలోనే ఉంచేందుకు ఒక ప్రత్యేక మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్ ఇచ్చి దాన్ని 24 గంటలూ ఆన్ చేసి ఉంచాలని ఆదేశించింది. అంతటితో ఆగకుండా ఆస్పత్రి సీసీటీవీ కెమెరాల పాస్‌వర్డ్‌లను కూడా తెలుసుకుని, ఆయన ప్రతి కదలికపై నిరంతరం నిఘా పెట్టింది. ఒకసారి డాక్టర్ పనుల నిమిత్తం అహ్మదాబాద్ వెళ్లినప్పుడు ఆ నర్స్ ఏకంగా 1,000 సార్లు ఫోన్ కాల్స్ చేసి వేధించింది. ఆయన ఫోన్ ఎత్తకపోవడంతో ఆగ్రహంతో ఆ పర్సనల్ ఫొటోలను ఆస్పత్రి సిబ్బందికి చూపించి బ్లాక్‌మైల్ చేయడమే కాకుండా, ఖాళీ చెక్కులు, స్టాంప్ పేపర్లపై బలవంతంగా సంతకాలు చేయించుకుని బ్యాంక్ లాకర్‌లో దాచుకుంది.
పోలీస్ కేసు.. నిందితురాలు అరెస్ట్.
ఈ మానసిక నరకం తట్టుకోలేక చివరికి బాధిత డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు.. దీంతో.. నర్స్ బెదిరింపుల వల్ల తన పర్సనల్, ఆస్పత్రి బ్యాంక్ ఖాతాల నుంచి దాదాపు రూ.2 కోట్లు ఆమెకు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు డాక్టర్. దీంతో బార్మేర్ అదనపు ఎస్పీ నితేష్ ఆర్య ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి నర్సును అరెస్ట్ చేసి, ఆమె వద్ద నుంచి రూ.17,000 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఆరోపణలన్నింటినీ నిందితురాలు ఖండిస్తూ, డాక్టర్ తనను కాపాడుకునేందుకే తనపై అబద్ధపు కేసులు పెడుతున్నాడని చెబుతోంది. ప్రస్తుతం పోలీసులు ఇద్దరి మధ్య ఉన్న సంబంధంపై, ఈ బ్లాక్‌మైలింగ్ నెట్‌వర్క్‌పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.