Viral Video: ఈ వీడియో చూస్తే జన్మలో ఇక ఓఆర్ఆర్‌పై డ్రైవింగ్ చేయాలంటే వణుకు పుట్టాల్సిందే..
Viral Video: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒక ప్రొఫెసర్‌కు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. వన్‌వే రోడ్డుపై ఎదురుగా వచ్చిన లారీని చూసి అప్రమత్తమై కారును పక్కకు తిప్పడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
Viral Video: ఈ వీడియో చూస్తే జన్మలో ఇక ఓఆర్ఆర్‌పై డ్రైవింగ్ చేయాలంటే వణుకు పుట్టాల్సిందే..
Viral Video: మనం ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినప్పటికీ, రోడ్లపై నిబంధనలు పాటించని కొందరి నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడుతుంటాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఇటువంటి భయానక ఘటనే చోటుచేసుకుంది. ప్రొఫెసర్ సారిత్ చందా అనే వ్యక్తి తన కారులో వెళ్తున్న సమయంలో ఊహించని పరిణామం ఎదురైంది. షంషాబాద్ ఎంట్రీ దగ్గర ఓఆర్‌ఆర్‌పైకి ప్రవేశించిన ఆయన, ఒక మలుపు వద్ద టర్న్ తీసుకుంటుండగా సరిగ్గా ఎదురుగా ఒక ఆర్‌ఎంసీ లారీ రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకొచ్చింది.
అది వన్‌వే రోడ్డు అయినప్పటికీ, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యతిరేక దిశలో వాహనాన్ని నడపడంతో క్షణాల వ్యవధిలో పెను ప్రమాదం ముంచుకొచ్చింది. అయితే ప్రొఫెసర్ సారిత్ చందా చూపిన తక్షణ స్పందన, అప్రమత్తత వల్ల ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. కారును వెంటనే పక్కకు తిప్పడంతో లారీ డీకొనకుండా తప్పుకోగలిగామని ఆయన తెలిపారు. ఈ భయానక దృశ్యాలన్నీ ఆయన కారుకు అమర్చిన డాష్‌కామ్ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి.
కాగా, ఈ వీడియోను ఆయన 'ఎక్స్' వేదికగా షేర్ చేస్తూ సంబంధిత అధికారులకు ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసేవారిపై ఎలాంటి కనికరం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్పందించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి RGIA పోలీసుల సహకారంతో లారీ డ్రైవర్‌ను విజయవంతంగా ట్రేస్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆ డ్రైవర్‌ను శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైవేలపై ఇలా నిబంధనలు ఉల్లంఘించే వారి వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, డ్రైవర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.