Viral Video: నాన్నకు కూతురు ఎప్పుడూ మహరాణినే.. క్యూట్ వీడియో మీకోసమే!

Viral Video: ప్రతి తండ్రికి తన కూతురు ఓ రాకుమారి లాంటిదే. కూతురి చిన్న చిన్న సరదాలను తీరుస్తూ ఓ తండ్రి తన తోపుడు బండిపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్న క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Update: 2026-07-02 04:37 GMT

Viral Video: నాన్నకు కూతురు ఎప్పుడూ మహరాణినే.. క్యూట్ వీడియో మీకోసమే!

Viral Video: నాన్న అనగానే పిల్లలకు ఎంతో భరోసా. అందులోనూ ఆడపిల్లలకు నాన్నంటే ఓ హీరో, రక్షకుడు. ప్రతి తండ్రి తన కూతురిని ఓ రాకుమారిలా చూసుకుంటాడు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. తన బిడ్డ కళ్ళలో ఆనందం చూడటం కోసం తండ్రి పడే తపన అంతా ఇంతా కాదు. తాజాగా ఇలాంటి తండ్రీకూతుళ్ల స్వచ్ఛమైన ప్రేమను చాటిచెప్పే ఓ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది.

ఈ వైరల్ వీడియోలో.. ఓ పేద తండ్రి తన కూతురిని తన తోపుడు బండిపై కూర్చోబెట్టుకుని ఎంతో సంతోషంగా తీసుకెళ్తున్నాడు. ఓ డైరీ వద్ద జరిగిన ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. బిడ్డ చిన్న చిన్న సరదాలను నెరవేరుస్తూ, ఓ మహారాణిలా తన బండిపై తీసుకెళ్తున్న ఆ తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఆ చిన్నారి ముఖంలో ఉన్న చిరునవ్వు, తండ్రి కళ్లలోని సంతృప్తి చూస్తుంటే.. ఆ తండ్రి డబ్బుకు పేదవాడు కావచ్చు కానీ, తన కూతురిపై చూపిస్తున్న ప్రేమ విషయంలో మాత్రం ఏమాత్రం పేదవాడు కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధానికి అద్దం పడుతున్న ఈ మనసుని హత్తుకునే వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.


Tags:    

Similar News