Cab Driver: క్యాబ్ డ్రైవర్‌ని చూసి నవ్విన అమ్మాయిలు.. ఐటీ ఇంజనీర్ అని చెప్పి ఇచ్చి పడేశాడు!

Cab Driver: తాను ఐటీ ఇంజనీర్‌నని చెప్పిన ఓ ఉబెర్ క్యాబ్ డ్రైవర్‌ను చూసి కొందరు అమ్మాయిలు హేళనగా నవ్విన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

Update: 2026-05-26 02:48 GMT

Cab Driver: క్యాబ్ డ్రైవర్‌ని చూసి నవ్విన అమ్మాయిలు.. ఐటీ ఇంజనీర్ అని చెప్పి ఇచ్చి పడేశాడు!

Cab Driver: సోషల్ మీడియా ప్రపంచంలో రోజుకు వందల వీడియోలు చూస్తుంటాం. కొన్ని నవ్విస్తాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ, తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం సమాజాన్ని, మనుషుల ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఒక ఉబెర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న కొందరు అమ్మాయిలు, తమ డ్రైవర్ విద్యా అర్హత విని నవ్విన తీరు ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్న ఆ వైరల్ వీడియోలో అసలు ఏం జరిగిందంటే..?

ఒక క్యాబ్‌లో కొందరు అమ్మాయిలు ప్రయాణిస్తున్నారు. ప్రయాణం మధ్యలో క్యాబ్ డ్రైవర్‌తో మాటలు కలిశాయి. ఈ క్రమంలోనే ఆ డ్రైవర్ తన గతాన్ని, చదువును ప్రస్తావిస్తూ.. తాను ఒక ఐటీఇంజనీర్ అని చెబుతాడు. ఆ మాట వినడమే ఆలస్యం.. వెనుక సీట్లో కూర్చున్న అమ్మాయిలు ఒక్కసారిగా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. అతను ఏదో జోక్ చేస్తున్నాడని భావించి, హేళన చేస్తున్నట్లుగా వారు నవ్విన తీరు ఆ డ్రైవర్‌ను తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. తాను నిజమే చెబుతున్నా ఎదుటివారు కించపరిచేలా నవ్వుతుంటే ఆ యువకుడు పడిన మానసిక వేదన ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

కడిగిపారేస్తున్న నెటిజన్లు

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోకి రావడమే ఆలస్యం.. విపరీతంగా వైరల్ అయ్యింది. అమ్మాయిల ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చదువు ఉంటే సరిపోదు.. సంస్కారం కూడా ఉండాలి. కష్టపడి, చెమటోడ్చి రూపాయి సంపాదించడంలో తప్పులేదు. ఒకరి శ్రమను గౌరవించడం నేర్చుకోండి అంటూ నెటిజన్లు సదరు అమ్మాయిలకు క్లాస్ పీకుతున్నారు.

ఐటీ లే-ఆఫ్స్‌లో

ప్రస్తుతం ఐటీ రంగంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. భారీగా జరుగుతున్న లే-ఆఫ్స్ వల్ల ఎంతోమంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు రోడ్డున పడ్డారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని, ఈ చిన్న ఉద్యోగాలు నేనేలా చేయాలి? అని అహంకారంతో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా, స్వయం ఉపాధిని నమ్ముకుని క్యాబ్ నడుపుతున్న ఆ యువకుడి ధైర్యాన్ని, శ్రమను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.


Tags:    

Similar News