Viral : మ్యాథ్స్ ఎగ్జామ్‌లో స్టూడెంట్ లవ్ స్టోరీ.. పేపర్ దిద్దుతూ నవ్వు ఆపుకోలేకపోయిన మాస్టార్

Viral : ఉత్తరప్రదేశ్‌లో ఒక పదో తరగతి విద్యార్థి మ్యాథ్స్ పరీక్షలో లెక్కలు రాయడానికి బదులు షాయరీలు, తన లవ్ స్టోరీ రాసి, పాస్ చేయడం కోసం ఏకంగా రూ.2100 డబ్బులు పెట్టాడు.

Update: 2026-05-25 03:02 GMT

Viral Video

Viral : పరీక్షలు అనగానే విద్యార్థుల్లో ఒకటే టెన్షన్ ఉంటుంది. ఏడాది పొడవునా చదివిన చదువును ఆ మూడు గంటల్లో పేపర్ మీద పెట్టాలి. కొందరు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే, మరికొందరు మాత్రం చదవకపోయినా ఏదో ఒకటి రాసి పాస్ అయిపోవాలని చూస్తుంటారు. కానీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మాత్రం పరీక్ష పేపర్‌ను ఏకంగా ఒక లవ్ లెటర్, కామెడీ స్క్రిప్ట్‌గా మార్చేశాడు. పదో తరగతి చదువుతున్న గోలు కుమార్ అనే విద్యార్థికి మ్యాథ్స్ పేపర్ చాలా కష్టంగా అనిపించింది. దాంతో అతనికి ఏ ఒక్క లెక్కా రాకపోవడంతో, ఆన్సర్ షీట్‌లో లెక్కలకు బదులు తన మనసులోని భావాలను, రకరకాల కవితలను రాసి పెట్టాడు. ప్రస్తుతం ఈ ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

టీచర్ ఆన్సర్ షీట్ వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఈ వింతైన సమాధానాలు చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. గోలు కుమార్ తన పేపర్ మొదటి పేజీలో జై బజరంగ్ బలి అని రాసి దేవుడి ఆశీస్సులతో పరీక్షను ప్రారంభించాడు. ఆ తర్వాత కింద టీచర్‌ను బతిమాలుకుంటూ ఒక మంచి రైమింగ్ కవిత రాశాడు. "నా కాపీ గురువుగారి దగ్గరికి చేరింది.. దయచేసి నాకు 33 మార్కులు వేసి పాస్ చేయండి" అంటూ ప్రాధేయపడ్డాడు. అక్కడితో ఆగకుండా.. "నా బగ్గీ, నా గుర్రం.. నన్ను కూడా కాస్త పాస్ చేయండి" అంటూ సినిమా డైలాగుల తరహాలో కవితలు అల్లేశాడు. ఈ లాజిక్ లేని కవితలు చూసి సదరు టీచర్ కూడా షాక్ తిన్నారు.

ఇక పేజీలు తిప్పుతున్న కొద్దీ ఆ కుర్రాడి అసలైన క్రియేటివిటీ బయటపడింది. తాను పరీక్ష సరిగ్గా రాయకపోవడానికి గల కారణాన్ని కూడా ఆన్సర్ షీట్‌లోనే వివరించాడు. మొబైల్ గేమ్‌లకు బానిసైన అతను.. "తాను రాత్రంతా ఫ్రీఫైర్ గేమ్‌లో హెడ్‌షాట్‌ల మీద హెడ్‌షాట్‌లు కొట్టానని, అందుకే ఎగ్జామ్ హాల్‌లో పేజీలన్నీ ఖాళీగా మిగిలిపోయాయి" అని చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడు. గేమ్స్ మాత్రమే కాదు, తన జీవితంలో జరిగిన ఒక పెద్ద లవ్ ఫెయిల్యూర్ స్టోరీని కూడా ఆ మ్యాథ్స్ పేపర్‌లోనే రాసి పెట్టాడు.

"నన్ను ఒక పరాయి వాడి కోసం తను వదిలేసింది.. కానీ ఒకప్పుడు నేను కూడా ఈ ప్రపంచానికి టాపర్‌నే" అంటూ తన బాధను వెళ్లగక్కాడు. అంతేకాదు పేపర్ కింద పెద్ద అక్షరాలతో.. "నేహా ప్లీజ్ తిరిగి వచ్చేయ్, ఐ లవ్ యూ" అంటూ తన గర్ల్‌ఫ్రెండ్‌ను బతిమాలుకుంటూ రాశాడు. లవ్ స్టోరీ రాస్తే టీచర్ మార్కులు వేయరని అనుకున్నాడో ఏమో గానీ.. ఆ కుర్రాడు పేపర్ల మధ్యలో ఏకంగా రూ.2100 నగదును పెట్టాడు. ఎలాగైనా ఆ డబ్బులు లంచంగా తీసుకుని తనకు పాస్ మార్కులు వేయాలని ప్లాన్ వేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో మీమర్స్, నెటిజన్లు ఈ కుర్రాడి ఐడియా చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.

Tags:    

Similar News