ఈ పజిల్‌కు 15 సెకండ్లల్లో సమాధానం చెప్పగలరా?.. చెప్తే మీరే తోపు.. మ్యాథ్స్ ట్రిక్ ఇదే!
Math Puzzle: A viral math puzzle is challenging the internet. ఈ ఈజీ పజిల్‌కు 15 సెకండ్లల్లో సమాధానం చెప్పాలి. సమయంలోగా ఆన్సర్ చెబితే.. మిరే తోపు.
ఈ పజిల్‌కు 15 సెకండ్లల్లో సమాధానం చెప్పగలరా?.. చెప్తే మీరే తోపు.. మ్యాథ్స్ ట్రిక్ ఇదే!
Math Puzzle: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో మ్యాథ్స్ పజిల్స్ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా కఠినంగా ఉంటే.. మరికొన్ని డెడ్ ఈజీగా ఉంటాయి. ఇంకొన్ని మాత్రం ఒక ప్రత్యేక ప్యాటర్న్ ఆధారంగా రూపొందించబడతాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ పజిల్ కూడా అలాంటిదే. ఈ ఈజీ పజిల్‌కు 15 సెకండ్లల్లో సమాధానం చెప్పాలి. సమయంలోగా ఆన్సర్ చెబితే.. మిరే తోపు. సమాధానం రాకపోయినా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరో 2-3 సార్లు ప్రయత్నిస్తే అదే వస్తుంది.
పై ఫోటోలో 6 = 19, 7 = 23, 8 = 27 అని ఇచ్చి.. 5 = ? అని ప్రశ్నించారు. ఈ పజిల్ చూసిన చాలామంది తమ తమ లెక్కలతో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ పజిల్‌కు సరైన సమాధానం 15. ఈ పజిల్ వెనుక ఉన్న లాజిక్ సాధారణ గణిత సూత్రం కాదు. ఇందులో ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్‌ను అనుసరించారు. మొదట ప్రతి సంఖ్యను 3తో గుణించి, ఆ తర్వాత వరుసగా 1, 2, 3లను కలిపారు.
6 = 19 విషయానికి వస్తే.. 6 × 3 + 1 = 19 అవుతుంది. అలానే 7 × 3 + 2 = 23 కాగా.. 8 × 3 + 3 = 27 అవుతుంది. అయితే 5 విషయంలో అదనంగా కలపాల్సిన సంఖ్య మాత్రం జీరో (0). అప్పుడు 5 × 3 + 0 = 15 అని సమాధానం వస్తుంది. అందుకే ఈ పజిల్‌లో సరైన సమాధానం 15గా పేర్కొన్నారు. 6కు 1, 7కు 2, 8కి 3లను కలిపారు. 6 ముందు 5 ఉంటుంది కాబట్టి మనం జీరోను కలపాల్సి ఉంటుంది. ఇదే అసలైన లాజిక్.
ఇలాంటి పజిల్స్‌కు ఒకే ఒక్క శాశ్వత గణిత నియమం ఉండదు. వాటిని రూపొందించిన వ్యక్తి ఎలాంటి ప్యాటర్న్‌ను అనుసరించాడో గుర్తించడం కీలకం. అందుకే కొందరు ఈ పజిల్‌కు వేర్వేరు సమాధానాలు చెప్పినా.. ప్రశ్న రూపొందించిన విధానాన్ని అనుసరిస్తే 15నే సరైన సమాధానం అవుతుంది. ఇలాంటి బ్రెయిన్ టీజర్లు, లాజిక్ పజిల్స్ మన పరిశీలనా శక్తిని, ఆలోచనా విధానాన్ని పరీక్షిస్తాయి. అయితే ప్రతి వైరల్ పజిల్‌కు ఒకే సరైన గణిత పరిష్కారం ఉంటుందని అనుకోవద్దు. చాలాసార్లు ఆన్సర్ పూర్తిగా ప్రశ్నను రూపొందించిన ప్యాటర్న్‌పైనే ఆధారపడి ఉంటుంది.