Jangapally: జంగపల్లిలో విషాదం.. చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి!

Jangapally: సిద్దిపేట జిల్లా జంగపల్లిలో విషాదం. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి.

Update: 2026-06-23 05:16 GMT

Jangapally: జంగపల్లిలో విషాదం.. చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి!

సిద్దిపేట జిల్లా: అక్బర్ పేట -భూంపల్లి మండలం జంగపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నా రులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యువాత పడ్డారు. గ్రామా నికి చెందిన కొట్టే వివేక్ (10), బోయ మనీశ్వర్ (11) నాలుగో తరగతి చదువుతున్నారు.

ఆడుకుంటూ ఇద్దరూ గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. వీరు ఈతకు వెళ్లి చెరువులో పడి మృత్యువాత పడినట్లు భావిస్తున్నారు. చెరువు గట్టుపై దుస్తులు ఉండటం, చిన్నా రులు ఇద్దరు కనిపించకపోవడంతో చెరువులో వెతకగా, మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News