Siddipet: 'హలో ఉప సర్పంచ్' పోస్టర్ ఆవిష్కరించిన శ్రీకాంత్ యాదవ్!
Siddipet: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రేపు (జూన్ 25) హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద “హలో ఉప సర్పంచ్ - చలో హైదరాబాద్” మహాధర్నా జరగనుంది.
Siddipet: 'హలో ఉప సర్పంచ్' పోస్టర్ ఆవిష్కరించిన శ్రీకాంత్ యాదవ్!
Siddipet: ఉప సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ, న్యాయ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న “ హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్” అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ ఉప సర్పంచ్ ఆత్మకూరి శ్రీకాంత్ యాదవ్ పిలుపునిచ్చారు.
సందర్భంగా ఉప సర్పంచ్ శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ... ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌పై వస్తున్న ప్రచారాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. గ్రామ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప సర్పంచ్‌లకు నెలకు రూ.5,000, వార్డ్ సభ్యులకు రూ.3,000 గౌరవ వేతనం ప్రకటించాలని కోరారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ ధర్నాకు తొగుట మండలం ఉప సర్పంచ్‌లు, వార్డ్ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.