Siddipet: రజనీకాంత్ రెడ్డి స్కూల్‌లో సీపీఎం తనిఖీలు.. ఫీజులపై ఆగ్రహం!

Siddipet: దుబ్బాకలోని రజనీకాంత్ రెడ్డి ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న ఫీజుల దోపిడీని నియంత్రించాలని సీపీఎం డిమాండ్ చేసింది.

Update: 2026-06-25 03:30 GMT

Siddipet: రజనీకాంత్ రెడ్డి స్కూల్‌లో సీపీఎం తనిఖీలు.. ఫీజులపై ఆగ్రహం!

Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పట్టణంలోని రజనీకాంత్ రెడ్డి ప్రైవేటు పాఠశాలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. పాఠశాలలోని మౌలిక వసతులను మరియు ఆస్టలో వసతులను పరిశీలించడం జరిగింది.

అనంతరం సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కార్పోరేట్ విద్యా, వైద్య రంగాలలో అధిక ఫీజుల నియంత్రణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం రజనీకాంత్ రెడ్డి ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ కొనసాగుతుందని విమర్శించారు.ఇక్కడి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని ఇక్కడ ఉద్యోగ ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టడం లేదని కార్మికులు రైతులు కష్టజీవులు నిరంతరం కష్టపడితే కుటుంబం గడవడమే కష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో పాఠశాలకు అలవాటు చేసే నర్సరీకి 22,500 ఫీజు నియమించడం.

Tags:    

Similar News