Korukonda: టెన్త్ టాపర్ హేమలక్ష్మికి బీజేపీ నేత వీరన్న చౌదరి ప్రోత్సాహం!
Korukonda: కోరుకొండ మండల టెన్త్ క్లాస్ టాపర్ హేమలక్ష్మికి బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి రూ.10,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి అభినందించారు.
Korukonda: టెన్త్ టాపర్ హేమలక్ష్మికి బీజేపీ నేత వీరన్న చౌదరి ప్రోత్సాహం!
కోరుకొండ: కోరుకొండ మండలంలో పదో తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని హేమలక్ష్మికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మండల ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి ప్రోత్సాహం అందించారు.
శ్రీరంగపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ లో ఫస్ట్ వచ్చిన హేమలక్ష్మి తండ్రికి 10,000 రూపాయల ప్రైజ్ మనీని బహూకరించారు. విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని, హేమలక్ష్మి ఉన్నత చదువుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.