Snacks: సెలవుల్లో పిల్లల కోసం 10 నిమిషాల్లో అయిపోయే ఫటాఫట్‌ స్నాక్స్‌

10 Minute Instant Snacks: వేసవి సెలవుల్లో పిల్లలకు తక్షణం ఆరోగ్యకరమైన స్నాక్స్ కోసం మీల్ మేకర్ తో 10 నిమిషాల్లో తయారయ్యే రుచికర వంటలపై వివరణ.

Update: 2026-05-15 00:30 GMT

Quick Meal Maker Snacks

10 Minute Instant Snacks: వేసవి సెలవులు ఇచ్చినప్పటి నుంచి పిల్లలు అంతా ఇంట్లోనే ఉంటారు.కచ్చితంగా వారు ప్రతి గంట గంటకి ఏదోకటి తినడానికి కావాలని మారం చేస్తుంటారు.



అలాంటప్పుడు ఎంతసేపు ఒకటే ఫుడ్‌ ఐటమ్‌ కాకుండా, వంటగదిలో ఎక్కువసేపు మగ్గిపోకుండా కేవలం పది నిమిషాల్లో వారికి మీల్‌ మేకర్స్‌ తో మంచి రుచికరమైన స్నాక్‌ ఐటమ్స్‌ చేసిపెట్టొచ్చు.




 మీల్‌ మేకర్‌ తో చేసే ఈ స్నాక్‌ ఐటమ్స్‌ కేవలం పిల్లలు మాత్రమే కాకుండా పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.మీల్ మేకర్‌ లో మటన్‌ కంటే ఎక్కువ ప్రోటీన్‌ ఉంటుంది.





చిల్లీ సోయా 

ఇది ఇండో-చైనీస్ స్టైల్ స్నాక్.

తయారీ: ముందుగా ఉడకబెట్టుకున్న సోయా చంక్స్‌ను కార్న్‌ఫ్లోర్, ఉప్పు, కారం కలిపి డీప్ ఫ్రై చేయాలి. ఆ తర్వాత బాణలిలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి.. సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్ వేసి ఫ్రై చేసిన సోయా చంక్స్‌ను అందులో వేసి కలుపుకోవాలి.





 సోయా 65

పిల్లలు చికెన్ 65 లాగా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.

తయారీ: మీల్ మేకర్‌ను వేడి నీళ్లలో ఉడికించి గట్టిగా నీరు పోయేంత వరకు పిండాలి. ఇందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్ కలిపి 10 నిమిషాలు నాననివ్వాలి. ఆపై నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే కరకరలాడే సోయా 65 తయారు.




 సోయా కట్లెట్ 

సాయంత్రం పూట టీ టైమ్ స్నాక్స్‌కు ఇది బెస్ట్.

తయారీ: మీల్ మేకర్‌ను మిక్సీ పట్టి పొడి చేయాలి. ఇందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కలిపి చిన్న చిన్న బిళ్లల్లా చేసుకోవాలి. వీటిని పెనంపై కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది.





సోయా కీమా 

దీనిని రోటీలు లేదా బ్రెడ్ టోస్ట్‌తో కలిపి తింటే చాలా బాగుంటుంది.

తయారీ: సోయా చంక్స్‌ను నానబెట్టి మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. బాణలిలో ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసి మగ్గించి, కొంచెం గరం మసాలా వేసి ఈ సోయా కీమాను అందులో కలిపి 5 నిమిషాలు ఉడికించుకోవాలి.




 సోయా చంక్స్ కబాబ్

ఆరోగ్యకరమైన, తక్కువ నూనెతో చేసే స్నాక్ ఇది.

తయారీ: సోయా పొడిలో శనగపిండి, పెరుగు, నిమ్మరసం, చాట్ మసాలా కలిపి చిన్న ముద్దలుగా చేసి కబాబ్ షేప్‌లో ఒత్తుకోవాలి. వీటిని గ్రిల్ చేసినా ఫర్వాలేదు..పెనం మీద వేయించుకున్న ఫర్వాలేదు.



సోయా చంక్స్ పులావ్

మధ్యాహ్న భోజనానికి పది నిమిషాల్లో అయిపోయే వెరైటీ ఇది.

తయారీ: కుక్కర్‌లో నూనె వేసి పులావ్‌ దినుసులు,గరంమసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించాలి. నానబెట్టిన మీల్ మేకర్స్, కడిగిన బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి రెండు విజిల్స్ రానివ్వాలి. దీనికి పెరుగు పచ్చడి కాంబినేషన్‌ బాగుంటుంది.






 

Tags:    

Similar News