Best Mileage Cars : బెస్ట్ మైలేజ్ ఇచ్చే టాప్ 6 హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ కార్లు..!
Best Mileage Cars : పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలంటే ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్ హైబ్రిడ్ , ఎలక్ట్రిక్ కార్లు. ఇండియాలో ప్రస్తుతం మారుతి సుజుకి,
Best Mileage Cars
Best Mileage Cars : పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలంటే ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్ హైబ్రిడ్ , ఎలక్ట్రిక్ కార్లు. ఇండియాలో ప్రస్తుతం మారుతి సుజుకి, టొయోటా, హోండా, కియా వంటి కంపెనీలు అదిరిపోయే మైలేజ్ ఇచ్చే సరికొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తక్కువ రన్నింగ్ కాస్ట్, లగ్జరీ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీతో దూసుకుపోతున్న టాప్ 6 కార్ల వివరాలను చూసేయండి.
మారుతి సుజుకి విక్టోరిస్ (Victoris): ఇది ఇండియాలో మోస్ట్ అఫర్డబుల్ హైబ్రిడ్ SUV. కేవలం రూ. 10.49 లక్షల స్టార్టింగ్ ప్రైస్‌తో పాటు ఏకంగా 28.65 kmpl మైలేజీని ఇస్తుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా: ఇండియన్ మార్కెట్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ SUV. ఇది 27.97 kmpl మైలేజ్ ఇవ్వడమే కాకుండా, సిటీలో కేవలం బ్యాటరీ (EV Mode) పవర్‌తో నడుస్తుంది.
టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్: టొయోటా నమ్మకంతో వస్తున్న ఈ కారులో స్మూత్ హైబ్రిడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీని బ్యాటరీపై కంపెనీ 8 ఏళ్ల వారంటీని ఆఫర్ చేస్తోంది.
హోండా సిటీ eHEV: సెడాన్ లవర్స్ కోసం ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులోని అడ్వాన్స్‌డ్ డ్యూయల్ మోటార్ సిస్టమ్ 27 kmpl మైలేజీని ఇస్తూనే, అదిరిపోయే లగ్జరీ ఫీచర్లను అందిస్తుంది.
కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ: కియా నుండి వస్తున్న ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 490 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇందులో బ్యాటరీ కోసం కిలోమీటరుకు రూ. 3.3 చెల్లించే BaaS ప్లాన్ ఉంది.
BYD అట్టో 3 & సీలియన్ 7: చైనా దిగ్గజం BYD నుంచి వస్తున్న ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లలో సేఫ్టీ కోసం వరల్డ్ ఫేమస్ 'బ్లేడ్ బ్యాటరీ' టెక్నాలజీని వాడారు. జూలై 1 నుండి వీటి ధరలు పెరగబోతున్నాయి.