Alia Bhatt Cannes 2026: పీచ్ గౌన్‌లో అలియా గ్లామర్ షో.. కాన్స్‌లో ప్రత్యేక ఆకర్షణ

కాన్స్ 2026 రెడ్ కార్పెట్‌పై అలియా భట్ పీచ్ గౌన్‌లో మెరిశారు. ఆమె దుపట్టా స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2026-05-13 10:37 GMT

Alia Bhatt Cannes 2026 Look Goes Viral With Dupatta

79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్న అలియా రెడ్ కార్పెట్ లుక్ చివరకు బయటకు రావడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. ప్రత్యేకంగా ఆమె ధరించిన పీచ్ కలర్ గౌన్‌తో పాటు దుపట్టా స్టైల్ అందరి దృష్టిని ఆకర్షించింది.






స్టైలిస్ట్ రియా కపూర్ డిజైన్ చేసిన కస్టమ్ తమారా రాల్ఫ్ హౌట్ కౌచర్ గౌన్‌లో అలియా మెరిశారు. స్ట్రాప్‌లెస్ డిజైన్, బాడీ హగ్గింగ్ కార్సెట్ స్టైల్ గౌన్‌కు జత చేసిన షిఫాన్ దుపట్టా భారతీయ అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. 90ల బాలీవుడ్ సినిమాల్లో కనిపించే క్లాసిక్ దుపట్టా స్టైల్‌ను గుర్తు చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.






 అలియా ధరించిన జ్యువెలరీ కూడా హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 168.27 క్యారెట్ల అరుదైన పింక్ కోరల్ నెక్లెస్‌తో పాటు మధ్యలో 5.53 క్యారెట్ల డైమండ్ ఉన్న ప్రత్యేక ఆభరణాన్ని ఆమె ధరించారు. దీనికి మ్యాచ్ అయ్యే డైమండ్ ఇయర్‌రింగ్స్ కూడా ఆమె లుక్‌కు మరింత ఆకర్షణ తెచ్చాయి.






సాఫ్ట్ గ్లామ్ మేకప్, పీచ్ పింక్ టోన్స్, కర్టెన్ బ్యాంగ్స్‌తో అలియా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాన్స్ ఫెస్టివల్‌లో ఇప్పటికే రెండు డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకున్న అలియా.. రెడ్ కార్పెట్‌పై మాత్రం హై గ్లామర్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Tags:    

Similar News