September OTT Releases: ఈ వారం అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!
September OTT Releases: సెప్టెంబర్ 2026లో OTT ప్రేక్షకులకు వినోదం పుష్కలంగా ఉండనుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్, ఆపిల్ టీవీ+ వేదికలపై
September-2026-OTT-releases
September OTT Releases: సెప్టెంబర్ 2026లో OTT ప్రేక్షకులకు వినోదం పుష్కలంగా ఉండనుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్, ఆపిల్ టీవీ+ వేదికలపై కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. తాప్సీ పన్ను నటించిన గాంధారి, ది జెంటిల్‌మెన్ సీజన్ 2, ఉన్మాదం, ధమాల్ 4తో పాటు పలు ఆసక్తికరమైన కంటెంట్ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా కొత్త కంటెంట్
సెప్టెంబర్ 1న ఆస్ట్రేలియన్ బ్రేక్‌డాన్సర్ రేచల్ గన్ అలియాస్ రేగన్ కథ ఆధారంగా రూపొందిన Untold Raygun: Breaking Badly డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె వివాదాస్పద ప్రదర్శన, ఆ తర్వాత ఎదురైన విమర్శలు ఇందులో కనిపించనున్నాయి. సెప్టెంబర్ 2న Turning Point: Generation 9/11 డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌కు రానుంది. 9/11 దాడుల ప్రభావంతో మారిపోయిన ఓ తరం కథను ఇది చూపించనుంది.
తాప్సీ ‘గాంధారి’.. మదర్ యాక్షన్ థ్రిల్లర్
సెప్టెంబర్ 3న తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన గాంధారి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. కిడ్నాప్ అయిన తన కుమార్తె కోసం ఓ తల్లి చేసే పోరాటం, ఆ క్రమంలో ఆమె ఎంచుకున్న ప్రతీకార మార్గం చుట్టూ కథ సాగుతుంది. అదే రోజు గై రిచీ క్రైమ్ కామెడీ డ్రామా ది జెంటిల్‌మెన్ సీజన్ 2 కూడా స్ట్రీమింగ్ కానుంది. థియో జేమ్స్ మరోసారి ఎడ్డీ హార్నిమన్‌గా కనిపించనున్నారు.
‘ఉన్మాదం’ నుంచి ‘జగమే సంగీతం’ వరకు
సెప్టెంబర్ 4న మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం సోనీలివ్‌లో విడుదల కానుంది. కుంచాకో బోబన్, లిజోమోల్ జోస్ నటించిన ఈ చిత్రంలో ఓ పోలీస్ అధికారి పాత హత్య కేసు మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. అదే రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జగమే సంగీతం మ్యూజికల్ డ్రామా సిరీస్ రానుంది. కుటుంబ వారసత్వం, సంగీతం, వ్యక్తిగత ఆశయాల నేపథ్యంలో కథ సాగుతుంది.
‘ధమాల్ 4’.. నవ్వుల విందుకు రెడీ..
కామెడీ ప్రియులు ఎదురుచూస్తున్న ధమాల్ 4 సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ, సంజయ్ దత్ మరోసారి తమ కామెడీతో సందడి చేయనున్నారు. డబ్బు, అపార్థాలు, సంపద కోసం జరిగే గందరగోళ వేట చుట్టూ ఈ కథ సాగుతుంది. అదే రోజు సత్య, రితికా నాయక్, వరుణ్ తేజ్ నటించిన హారర్ కామెడీ కొరియన్ కనకరాజు కూడా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.
కోర్టు డ్రామా.. రియాలిటీ షో.. హాలీవుడ్ థ్రిల్లర్
సెప్టెంబర్ 4న జియోహాట్‌స్టార్‌లో తమిళ లీగల్ డ్రామా ది కోర్ట్ స్ట్రీమింగ్ కానుంది. తడబడుతూ మాట్లాడే ఓ యువ న్యాయవాది తన తండ్రికి వ్యతిరేకంగా కోర్టులో పోరాడే కథ ఇది. మరోవైపు సెప్టెంబర్ 6న సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ 20 జియోహాట్‌స్టార్‌లో ప్రారంభం కానుంది. కొత్త సెలబ్రిటీ కంటెస్టెంట్లు, టాస్కులు, నామినేషన్లు, గొడవలు, పొత్తులతో మరోసారి రియాలిటీ షో సందడి చేయనుంది.
ఆపిల్ టీవీ+లో ‘మేడే’
సెప్టెంబర్ 4న ఆపిల్ టీవీ+లో మేడే విడుదల కానుంది. 1987 నేపథ్యంలో సాగే ఈ కథలో సోవియట్ భూభాగంలో కూలిపోయిన ఓ అమెరికా నేవీ పైలట్ శత్రు ప్రాంతంలో చిక్కుకుపోతాడు. అక్కడ మాజీ కేజీబీ ఏజెంట్ సహాయంతో బయటపడేందుకు ప్రయత్నించే క్రమంలో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకుంటాయి. మొత్తంగా చూస్తే సెప్టెంబర్ తొలి వారం OTT ప్రేక్షకులకు థ్రిల్లర్, కామెడీ, క్రైమ్, కోర్ట్‌రూమ్ డ్రామా, డాక్యుమెంటరీ, రియాలిటీ షో ఇలా అన్ని జానర్లలోనూ కొత్త కంటెంట్‌ను అందించనుంది.