DC OTT: బాక్సాఫీస్ వద్ద 'డీసీ' ఊచకోత.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే.?

DC OTT: కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మెగాఫోన్ పక్కనపెట్టి, తొలిసారి నటుడిగా అవతారమెత్తి చేసిన 'డీసీ' (DC) చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.

Update: 2026-08-21 13:44 GMT

DC OTT: బాక్సాఫీస్ వద్ద 'డీసీ' ఊచకోత.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే.?

DC OTT: కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మెగాఫోన్ పక్కనపెట్టి, తొలిసారి నటుడిగా అవతారమెత్తి చేసిన 'డీసీ' (DC) చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్, థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు నమోదు చేసింది. లోకేష్ కెమెరా ముందుకు వచ్చి చేసిన తొలి ప్రయత్నమే శతకోటి క్లబ్‌లో చేరడం విశేషం.

థియేటర్లను ఊపేసిన రాక్‌స్టార్ మ్యూజిక్.. త్వరలోనే ఓటీటీలోకి

ఈ సినిమాలో లోకేష్ నటనకు తోడుగా, రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ అందించిన ఉత్కంఠభరితమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ యాక్షన్ థ్రిల్లర్, ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సన్ నెక్స్ట్' ఈ చిత్ర డిజిటల్ హక్కులను దక్కించుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందం ఉండటంతో, సెప్టెంబర్ 11 లేదా 18వ తేదీల్లో ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఇంకా బలంగా ఉన్నందున, ఓటీటీ విడుదల తేదీ మరింత పొడిగించినా ఆశ్చర్యం లేదని టాక్ నడుస్తోంది.

అసలు ఏమిటీ 'డీసీ' కథ?

కథ విషయానికొస్తే.. దేవదాస్ అలియాస్ దాసు (లోకేష్ కనగరాజ్) పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను దొంగిలించే ఒక గ్యాంగ్‌స్టర్ బృందానికి నాయకత్వం వహిస్తుంటాడు. ఒకరోజు పోలీసులు ఒక సామాన్యుడి వద్ద ఉన్న రూ. 7 లక్షలను గుంజుకుని అతడిని దారుణంగా హత్య చేస్తారు. బాధితుడి భార్య వేడుకోవడంతో, దాసు ఆ అవినీతి పోలీస్ అధికారిని అంతం చేస్తాడు. దీంతో భోగరాజు అనే ప్రత్యేక పోలీస్ అధికారి నేతృత్వంలో దాసు గ్యాంగ్ కోసం వేట మొదలవుతుంది.

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో విజయవాడలోని ఒక బార్‌లో దాసు బృందం తలదాచుకుంటుంది. అక్కడ బార్ సింగర్ పార్వతి (సంజనా కృష్ణమాచారి) తో దాసు ప్రేమలో పడగా, పోలీసుల దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత వేశ్యగా ఉన్న చంద్ర (వామికా గబ్బి) కి దాసు విముక్తి కల్పిస్తాడు. అసలు చంద్ర వేశ్యగా ఎందుకు మారాల్సి వచ్చింది? దాసు క్రైమ్ ప్రపంచంలోకి ఎందుకు అడుగుపెట్టాడు? ఒక పేదవాడికి న్యాయం చేయడం కోసం దాసు చేసిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే అంశాలు థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ అనుభూతిని అందిస్తున్నాయి.

Tags:    

Similar News