Singarayakonda: అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా సింగరాయకొండ ఎంఈఓ తీరుపై విమర్శలు

Singarayakonda: సింగరాయకొండ ఎంఈఓ శ్రీనివాసరావు తీరుపై ప్రజాసంఘాలు ఆగ్రహం. అనుమతులు లేని పాఠశాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితుల ఆరోపణ.

Update: 2026-08-28 06:11 GMT

Singarayakonda: అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా సింగరాయకొండ ఎంఈఓ తీరుపై విమర్శలు

Singarayakonda: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం లో శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కు అనుమతులు లేవంటూ తౌషిక్ తల్లి ఫిర్యాదు మేరకు స్కూల్ యాజమాన్యం కు నోటీసులు అందించిన ఎంఈఓ బాధితులకు అండగా ఉంటానని అనుమతులు లేని స్కూలు యాజమాన్యం సమాధానం ఇవ్వకుంటే తగు చర్యలు తీసుకుంటామని చెప్పి నేడు బాధ్యతారాహిత్యంగా బాధితులకు వ్యతిరేకంగా ప్రవర్తించి మేము చర్యలు తీసుకోము ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఓ బాధ్యత గల విద్య అధికారిగా ఉండి మీరు ఇలా ఎలా మాట్లాడుతారు అంటూ అధికారిని నిలదీశారు ప్రజా సంఘాలనేతలు.. మాకు స్కూల్ యాజమాన్యం సమాధానం ఇచ్చిన ఇవ్వకున్నా మీకు మేము సమాధానం చెప్పవలసిన అవసరం లేదని.. మీరు చెబితే మేము వినాల్సిన అవసరం లేదంటూ నిర్లక్ష్య సమాధానం చెప్పి వెళ్లిపోవడంపై ఎంఈఓ కత్తి శ్రీనివాసరావు పై విద్యార్థి తల్లి మౌలాబి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు యాజమాన్యం అధికారులను సైతం తమ ఆర్థిక బలంతో లొంగు తీసుకుంటుందని.. అందుకు ఇదే సాక్ష్యం అని.. విద్యాధికారి పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు.

Tags:    

Similar News