Markapuram: మార్కాపురం మండలంలో మొహరం వేడుకలు
Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురం మండల వ్యాప్తంగా మొహరం వేడుకలు భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
Markapuram: మార్కాపురం మండలంలో మొహరం వేడుకలు
మార్కాపురం: మండల వ్యాప్తంగా మొహరం వేడుకలు భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ గ్రామాల్లో భక్తులు సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్, గ్రామీణ ఎస్సై వేమన ప్రజలకు కీలక సూచనలు చేశారు. మొహరం పండుగను కుల, మతాలకు అతీతంగా సామరస్య వాతావరణంలో జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో వేడుకల్లో పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.
అదే సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, అల్లర్లు, గొడవలు లేదా రెచ్చగొట్టే ప్రవర్తనకు పాల్పడరాదని హెచ్చరించారు. ఎవరైనా కావాలనే అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పండుగ సందర్భంగా పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు పోలీసు శాఖకు సహకరించి మొహరం వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్సై వేమన కోరారు.