Peddaraveedu: ఒకే ఒక్క టీచర్.. మూతపడే దశలో ప్రభుత్వ పాఠశాల!

Peddaraveedu: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చాట్లమడ అగ్రహారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల కొరతతో మనుగడ కోల్పోతోంది.

Update: 2026-06-23 06:12 GMT

Peddaraveedu: ఒకే ఒక్క టీచర్.. మూతపడే దశలో ప్రభుత్వ పాఠశాల!

పెద్దారవీడు: పెద్దారవీడు మండలం చాట్లమడ అగ్రహారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం ఉపాధ్యాయుల కొరతతో మనుగడ కోసం పోరాడుతోంది. 35 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో ఒకరు దీర్ఘకాలిక సెలవులో ఉండగా, మరొకరు బదిలీపై వెళ్లడంతో ప్రస్తుతం డిప్యుటేషన్‌పై వచ్చిన ఒకే ఒక్క ఉపాధ్యాయురాలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధిస్తున్నారు.

2024లో 26 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 14 మందికి తగ్గింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాల మనుగడ కోసం వెంటనే ఇద్దరు శాశ్వత ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్థులు, విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.

కలెక్టర్ గారు మా పిల్లల భవిష్యత్ కోసం ఉపాధ్యాయులను నియమించండి.... తోట గురునాధం:

"గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు కోసం చాట్లమడ అగ్రహారం పాఠశాలను పరిరక్షించి, శాశ్వత ఉపాధ్యాయులను నియమించాలి" అని తోట గురునాథం విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News