ఓటరు సవరణ విధుల్లో నిర్లక్ష్యం.. 6 గురు బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు
Markapuram: మార్కాపురం జిల్లాలో ఓటరు జాబితా SIR విధుల్లో నిర్లక్ష్యం వహించిన పెద్దారవీడు మండలం పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఎం. విజయసునీత సస్పెండ్ చేశారు.
ఓటరు సవరణ విధుల్లో నిర్లక్ష్యం.. 6 గురు బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు
Markapuram: మార్కాపురం జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వోలు) జిల్లా కలెక్టర్ ఎం. విజయసునీత షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించి, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించని పెద్దారవీడు మండలం రామాయపాలెం పంచాయతీ కార్యదర్శి ఎస్. శ్రీనివాసులను సస్పెండ్ చేశారు.
షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో మార్కాపురం పట్టణంలోని 2, 5, 12 సచివాలయాలకు చెందిన డి. పెద్ద మస్తాన్, ఎస్‌కే సల్మా, ఎం. శ్వేతతో పాటు మార్కాపురం రూరల్ పరిధిలోని భూపతిపల్లి, రాయవరం-1 సచివాలయాలకు చెందిన జి. మహేష్ రెడ్డి, కె. శ్రీనివాసరావు, జి. ఆంజనేయులు ఉన్నారు.
సర్ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతతో నిర్వహించాలని, ఇకపై నిర్లక్ష్యం సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు. విధులను సక్రమంగా నిర్వహించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఎల్వోలకు సూచించారు.