Markapuram: మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే కందులపై వైఎస్ఆర్సిపి నేతల ఆగ్రహం!
Markapuram: మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్టుపై రాజకీయం వేడెక్కింది. మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే కందులపై వైసీపీ నేతల ధ్వజం.
Markapuram: మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే కందులపై వైఎస్ఆర్సిపి నేతల ఆగ్రహం!
Markapuram: మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు అంశం రాజకీయంగా వేడెక్కింది. వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో సుమారు 70 నుంచి 75 శాతం పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం హయాంలోనే పూర్తయ్యాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు.
మార్కాపురం వైసీపీ ఇంచార్జ్ అన్నా రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రాజెక్టు కోసం ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమిటని ప్రశ్నించారు. R&R ప్యాకేజీ, ఫీడర్ కెనాల్ పనులు మినహా ప్రస్తుతం రూ.1,300 కోట్లతో ఏం పనులు చేశారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులన్నీ పూర్తయిపోయినట్లు డ్రామాలు చేస్తున్నారని వారు విమర్శించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నిర్వాసితులకు న్యాయం చేస్తానంటూ కేవలం షో చేస్తున్నారని బూచేపల్లి, తాటిపర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు.