Giddalur: కొమ్మునూరు సర్పంచ్ అభ్యర్థిగా కర్నాటి రాధ నామినేషన్ దాఖలు!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కొమ్మునూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలోకి టీడీపీ అభ్యర్థిగా కర్నాటి రాధ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Giddalur: కొమ్మునూరు సర్పంచ్ అభ్యర్థిగా కర్నాటి రాధ నామినేషన్ దాఖలు!
గిద్దలూరు: మార్కాపురం జిల్లా, గిద్దలూరు మండలం కొమ్మునూరు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలోకి కర్నాటి రాధ. టీడీపీ పార్టీ తరపున ఆమె సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
గ్రామంలో తాగునీటి సమస్య , రహదారుల అభివృద్ధి, పారిశుధ్యం, వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. రైతుల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కొమ్మునూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన రాధకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, పంచాయతీ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.