Markapuram: ఐదు మండలాల ఎంపీపీ అభ్యర్థులకు టీడీపీ బీ-ఫారాలు అందజేత!

మార్కాపురం: యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో, యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ఎంపీపీ అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ తరఫున బీ-ఫారాలను నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అందజేశారు.

బీ-ఫారాలు అందుకున్న ఎంపీపీ అభ్యర్థులు:

యర్రగొండపాలెం: చిట్యాల సుప్రజ, పుల్లలచెరువు: కాకర్ల వరలక్ష్మి, త్రిపురాంతకం: మాధవి, దోర్నాల: భూమని నాగమ్మ. పెద్దారవీడు: మెట్టు లక్ష్మీదేవి.

ఈ సందర్భంగా ఐదు మండలాల ఎంపీపీ అభ్యర్థులకు గూడూరి ఎరిక్షన్ బాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఆయా మండలాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పెద్దారవీడు టిడిపి మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గొట్టం శ్రీనివాస రెడ్డి, చిలక ఇజ్రాయిల్, యర్రగొండపాలెం యువజన నాయకులు శ్రీనివాసుల రెడ్డి, అనిల్, వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: