Markapur: మార్కాపురంలో మహిళపై కత్తితో దాడి – కలకలం రేపిన ఘటన
Markapur: మార్కాపురం విజయ టాకీస్ సమీపంలో మహిళపై కూరగాయలు తరిగే కత్తితో యువకుడు భీకర దాడి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Markapur: మార్కాపురంలో మహిళపై కత్తితో దాడి – కలకలం రేపిన ఘటన
మార్కాపూర్: మార్కాపురం పట్టణంలోని విజయ టాకీస్ సమీపంలోని బాసాని బజారులో ఓ మహిళపై యువకుడు కూరగాయలు తరిగే కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
జ్ఞాన దృష్టి నాగలక్ష్మి (40), భర్త రాము, ఇంట్లో వంట చేసుకుంటుండగా బైసాని మురళి (22) పసుపు కావాలంటూ వచ్చి కత్తితో ఆమెపై సుమారు ఎనిమిది సార్లు దాడి చేసినట్లు సమాచారం.
నాగలక్ష్మి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోగా మురళి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన నాగలక్ష్మిని స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. దాడికి గల కారణం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.