Kotalapalli: అడిగిన సర్టిఫికెట్ ఇవ్వలేదని సచివాలయ ఉద్యోగిపై టీడీపీ నేతల దాడి
Kotalapalli: వెలిగండ్ల మండలం కొటాలపల్లి స్వర్ణ సచివాలయ ఉద్యోగి వెంకటకృష్ణపై టీడీపీ మండల నాయకుడు ఇంద్రభూపాల్‌రెడ్డి, అనుచరులు తీవ్రస్థాయిలో దాడికి పాల్పడ్డారు.
Kotalapalli: అడిగిన సర్టిఫికెట్ ఇవ్వలేదని సచివాలయ ఉద్యోగిపై టీడీపీ నేతల దాడి
Kotalapalli: అడిగిన సర్టిఫికెట్ వెంటనే ఇవ్వలేదని కుర్చీలు, కర్రలతో తలపై మోదిన వైనం, వారు అడిగిన సర్టిఫికెట్‌ను వెంటనే ఇవ్వలేదనే కోపంతో టీడీపీ మండల నాయకుడు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, అతని అనుచరులు కలిసి సచివాలయ ఉద్యోగిపై దాడి చేసి కొట్టి తలపై తీవ్ర గాయాలు చేసిన ఘటన మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం కొటాలపల్లి స్వర్ణ సచివాలయంలో శుక్రవారం జరిగింది.
బాధితుడి కథనం మేరకు ఇటీవల సచివాలయ ఉద్యోగి కె. వెంకటకృష్ణ కొటాలపల్లికి బదిలీపై వచ్చి వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా డిజిటల్ అసిస్టెంట్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎలికా అంజయ్య కుమార్తెకు ఓబీసీ, కుల ధ్రువీకరణ పత్రాలు కావాలని అంజయ్య స్నేహితుడు వచ్చి అడిగారు.
అయితే ఆ సర్టిఫికెట్లను ఇప్పటికే జూన్ 28న తీసుకున్నారని, అవి మూడేళ్ల వరకు చెల్లుబాటు అవుతాయని ఉద్యోగి తెలిపారు. మళ్లీ సర్టిఫికెట్లు కావాలని వారు కోరడంతో కుల ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఓబీసీ, క్యాస్ట్ సర్టిఫికెట్లలో నేటివిటీ తేడా ఉందని, కనిగిరి నేటివిటీగా చూపిస్తోందని ఉద్యోగి తెలిపారు. దీనివల్ల కౌన్సెలింగ్‌కు ఇబ్బంది కలగవచ్చని, మరో చోట చేయించుకుంటే మంచిదని సూచించారు.
దీంతో ఆగ్రహించిన అంజయ్య.. మా ఊర్లో సచివాలయం పెట్టుకుని.. మేం బయటకు ఎందుకు వెళ్లాలి. పని చేతకాని ప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు? అంటూ దుర్భాషలాడినట్లు బాధితుడు తెలిపారు. తాను ఇన్‌చార్జిగా మాత్రమే ఉన్నానని చెప్పినా వినకుండా గొడవ చేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు.
గురువారం జరిగిన ఘటనను మనసులో పెట్టుకుని టీడీపీ మండల నాయకుడు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, అతని అనుచరులు, అంజయ్య మరికొందరు కలిసి సచివాలయానికి వచ్చి.. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో తనపై అనవసరంగా గొడవకు దిగి దుర్భాషలాడారని వెంకటకృష్ణ తెలిపారు.
అనంతరం కుర్చీలు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి తలపై కొట్టి, పిడిగుద్దులు గుద్ది తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని బాధితుడు వాపోయారు. తన ఫోన్ కూడా లాక్కుని భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వెంకటకృష్ణ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.