Markapur: వెలిగొండ నిర్వాసితులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే కందుల

Markapur: మార్కాపురం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. నిర్వాసితులకు భరోసా.

Update: 2026-08-08 13:54 GMT

Markapur: వెలిగొండ నిర్వాసితులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే కందుల

మార్కాపూర్: మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు.

మార్కాపురం కలెక్టరేట్ వద్ద సాంకేసుల గ్రామ నిర్వాసితులను కలిసి వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పునరావాసంలో భాగంగా కేటాయించిన ప్లాట్లలో రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ విజయ సునీత, ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి లను కోరారు.

నిర్వాసిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా అండగా ఉంటామని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి పక్షాన నిలబడతామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News