Rudrur: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ లో తాసిల్దార్ కు అగౌరవం!

Rudrur: రుద్రూర్ మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ వివాదం. ఎంపీడీవో తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన తహసీల్దార్ తారబాయి. అధికారుల సమన్వయ లోపంపై చర్చ.

Update: 2026-06-02 05:22 GMT

Rudrur: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ లో తాసిల్దార్ కు అగౌరవం!

Rudrur: బోధన్ డివిజన్ పరిధిలో ని రుద్రూర్ మండల కేంద్రం లో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ కార్యాలల్లో మంగళవారం జాతీయ్య జెండా ను ఆవిష్కరణ చేశారు. రుద్రూర్ సమీకృత భవనం లో వేరువేరుగా జెండా ను ఆవిష్కరణ చేశారు. ఎంపీడీవో కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యాలయ భవనం పై ఆవిష్కరణ చేసినప్పటికి తాసిల్దార్ తారబాయి కి ఆహ్వానించ క పోవడం తో తహసీల్దార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెండా ఆవిష్కరణ సమయం లో వివిధ శాఖ ల అధికారుల ముందు ఎంపీడీ వో బాల గంగాధర్ పై తహసీల్దార్ మండిపడ్డారు. తాను మండల మేజస్ట్ అని తెలియదా తనకు ఆహ్వానించకుండా జెండా ను ఆవిష్కరణ చేయడం సరికదాని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే భవనం లో వివిధ శాఖ కార్యాలయలు ఉన్నప్పటికి అధికారుల మధ్య సమన్వయ లోపం బట్టబయలైంది.

Tags:    

Similar News