Nizamabad: 20 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ స్థాయి యాంగ్ ఇండియా పాఠశాల
Nizamabad: నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్‌లో రూ. 200 కోట్లతో నిర్మించనున్న 'యాంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల' భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూపతి భూమి పూజ.
Nizamabad: 20 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ స్థాయి యాంగ్ ఇండియా పాఠశాల
Nizamabad: తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి కట్టుబడి ఉందని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు... నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్(ఏ) లో రూ. 200 కోట్లతో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.అన్ని వర్గాల ప్రజలకు విద్య బారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు...అధునాతన హంగులలతో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను రూ.200 కోట్లతో 20ఎకరాల విస్తీర్ణంలో మౌలిక వసతులతో పాఠశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కులాల వారిగా విద్యను విభజించారని ఆరోపించారు.