Jukkal: ఉపాధి హామీ పథకానికి 20 ఏళ్లు.. పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన వరం
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పర్యటించారు.
Jukkal: ఉపాధి హామీ పథకానికి 20 ఏళ్లు.. పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన వరం
Jukkal: జుక్కల్ (కామారెడ్డి) ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని పట్టణాలకు వలస వెళ్ళే కార్మికులకు స్థానికంగానే ఉపాధి కల్పించి వారి కుటుంబాల్లో సంతోషం నింపేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పథకం ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు స్పష్టం చేశారు.మంగళవారం ఆయన జుక్కల్ మండల కేంద్ర శివారులో రూర్బన్ నిధులతో నిర్మించిన ఆడిటోరియన్ని సందర్శించి పరిశీలించారు. ఆ భవనాన్ని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగ పడే విధంగా అభివృద్ధి చేసి వినియోగం లోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం ఉపాధి కార్మికుల కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట ఉపాధి హామీ పథకం గ్రామీణ పేద కుటుంబాలకు ఎంతో అండగ నిలిచిందని పేర్కొన్నారు.
గతంలో వలస వెళ్ళే కార్మికులను నివారించి గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా నేడు లక్షలాది కుటుంబాల జీవనోపాధి మెరుగుపడిందని తెలిపారు. ఉపాధి హామీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి విడుదల చేసే నిధులను పూర్తిగా తగ్గించి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తూ పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగ నిలుస్తామని తెలిపారు. కార్యక్రమం లో జుక్కల్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ జాదవ్ మారుతి ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కు శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ కె.సాయగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్ దేశాయ్, సొసైటీ చైర్మన్ శివానంద్, మాజి ఎంపి టి సి ఇమ్రాన్ ఖాన్, మాజి సర్పంచ్ బి. రాములు సెట్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.