Armoor: రాజీతో కేసులను పరిష్కరించుకోండి.. సివిల్ జడ్జి శ్రీదేవి
Armoor: ఆర్మూర్ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం కోసం సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశం జరిగింది.
Armoor: రాజీతో కేసులను పరిష్కరించుకోండి.. సివిల్ జడ్జి శ్రీదేవి
Armoor: ఈనెల 20న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా ఆర్మూర్ మండల్ లీగల్ సర్వీస్ చైర్ పర్సన్, సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ గురువారం నిర్వహించారు. ఈ మీటింగ్ లో సివిల్ జడ్జ్ తో పాటు జూనియర్ సివిల్ జడ్జి సరళ రాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీ ఉన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి :శ్రీ శ్రీదేవి
ఈ సందర్బంగా సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి మాట్లాడుతు....లోక్ అదాలత్ లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ నిర్వహణకు సంబంధించిన కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్నచిన్న పెట్టి కేసులు తదితర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం
లోక్ అదాలత్ ద్వారా
కల్పించబడుతుందని తెలిపారు.రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా రాజీ కుదిరేలా అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుదురుపాక ప్రవీణ్ చందర్, ఆర్మూర్ పట్టణ సీఐ సత్యనారాయణ గౌడ్, రూరల్ సీఐ జాన్ రెడ్డి, భీమ్గల్ సీఐ సత్యనారాయణ, అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్ఐ లు, కోర్ట్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.