Nellore: అప్రమత్తంగా వ్యవహరించి 45 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్

Nellore: నెల్లూరు జిల్లా సంగం వద్ద అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆర్టీసీ హైరర్ బస్సు డ్రైవర్ త్రిమోది. చాకచక్యంగా రోడ్డు పక్కకు బస్సు నిలిపి ప్రాణాలు కాపాడారు.

Update: 2026-07-22 09:50 GMT

Nellore: అప్రమత్తంగా వ్యవహరించి 45 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్

నెల్లూరు: నెల్లూరు జిల్లా సంఘం వద్ద నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఆర్టీసీ హైరర్ బస్సు కు తప్పిన పెను ప్రమాదం తప్పింది.45 మంది ప్రయాణకులతో పామూరు నుండి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ హైరర్ బస్సులో డ్రైవర్ త్రిమోదికి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు.

దీంతో చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్.. స్టీరింగ్‌పై వాలిపోయే ముందు రోడ్డు పక్కకు బస్సు నిలిపివేసి స్టీరింగ్ పై వాలిపోయాడు గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌ను వెంటనే సంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. అనంతరం వైద్యులు ప్రయాణికులకు డ్రైవర్ కు ప్రాణాపాయం లేదని తెలిపారు.ప్రాణాపాయ స్థితిలోనూ ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్‌పై ప్రశంసలు కురిపించారు. అనంతరం ప్రయాణికులకు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేసి నెల్లూరు తరలించారు.

Tags:    

Similar News