Nellore: నెల్లూరులో 'జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్' ఆవిర్భావం

Nellore: జర్నలిస్టులకు పోలీసుల నోటీసులను నిరసిస్తూ నెల్లూరులో జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ (JPF) ఏర్పాటు. సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసనకు నిర్ణయం.

Update: 2026-07-22 13:42 GMT

Nellore: నెల్లూరులో 'జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్' ఆవిర్భావం

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులపై, వివిధ రంగాల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొనేందుకు.. జిల్లా లో తొలిసారిగా "జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్" ఏర్పాటయింది. జిల్లాలోని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరో లు,ఇంచార్జ్ లు, అత్యవసర సమావేశమై జేపీఎఫ్ ను ఏర్పాటు చేశారు. ఇవాళ నగరంలోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో... జె పి ఎఫ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

ఇటీవల నెల్లూరు జిల్లా లో మనుబోలు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి జిల్లాలోని పలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు ప్రతినిధులకు పోలీసులు నోటీసులు పంపారు. జర్నలిస్ట్ లకు నోటీసులు ఇవ్వడాన్ని జేపీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకించింది.

సమాజంలో జరిగే కార్యక్రమాలు ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు, పోలీసులకు అది వ్యతిరేకం అనేది ఇచ్చినప్పుడు, దానిని నేరుగా వివరణ కోరడం ఏకపక్షంగా రాస్తే అందుకు సంబంధించిన చర్యలకు ముందు నోటీసులు ఇవ్వడం, సహజంగా జరిగే ప్రక్రియ.. మనుబోలు మండలం ఏడుకొండలు అనే వ్యక్తి మృతి చెందడం పై, బంధువులు లాక్ అప్ డెత్.. అంటుండగా పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ... వివరణ ఇచ్చారు.

దీనిపై ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. లు.. ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన చేశాయి... దీనిపై అన్ని మీడియా ప్రసార సాధనాలు, కథనాలను ప్రచురించాయి... ఈ క్రమంలో రెండు దినపత్రికలు, మరో రెండు సాటిలైట్ చానల్స్ కు పోలీసులు నోటీసులు అందించారు... నేరుగా రిపోర్టర్లు వివరణ ఇవ్వాలంటూ.. నోటీసులు పంపారు... ఈ సంఘటనలను తీవ్రంగా పరిగణించిన, జిల్లా జర్నలిస్టులు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు...‌ జర్నలిస్టు సంఘాలతో సంబంధం లేకుండా... అన్ని విభాగాలు కలిసి జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ గా ఏర్పాటయ్యారు... తాజాగా జరిగిన సంఘటనలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ ఘటనపై కార్యాచరణ రూపొందించే దిశగా చర్చించారు. మనుబోలు ఘటనపై నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ... వచ్చే సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద, నల్ల బ్యాడ్జీలతో నిరసన నిర్వహించి, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ, సీనియర్ నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లను కలిసి, సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాలని జెపిఎఫ్ తీర్మానించింది.

నూతనంగా ఏర్పాటైన జెపిఎఫ్ గౌరవాధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ డెక్కన్ క్రానికల్ కరస్పాండెంట్ పత్రి రాజశేఖర్, కన్వీనర్ గా ఛానల్ నైన్ ఎండి గోళ్ళ జయరాజ్, కో కన్వీనర్లుగా వెంకటేశ్వర్లు, మస్తాన్ రెడ్డి, నరసింహులు, సునీల్, దయాశంకర్, మునీంద్ర మురళీ లను నియమించారు.. జిల్లాకు చెందిన అన్ని ప్రింట్ అని ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రతినిధులను ఇందులో కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా నియమించారు.

ఇకపై జర్నలిస్టులకు సంబంధించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా.. జేపీఎఫ్ పూర్తిస్థాయిలో బాధ్యత జర్నలిస్టులకు అండగా నిలుస్తుందని, నూతన కమిటీ నాయకులు తెలిపారు. ఇదే సమయంలో జర్నలిస్టుల ముసుగులో వివిధ వర్గాలను ఇబ్బంది పెడుతూ.. జర్నలిస్టులకు అపవాదులు తెచ్చేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని జెపిఎఫ్ నిర్ణయించింది.

"నెల్లూరు జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ (JPF)"

"గౌరవ అధ్యక్షులు..."

1.P. రాజశేఖర్

కన్వీనర్...

G. జయరాజ్ ఛానెల్ 9HD

"కో కన్వీనర్లు..."

K.దయా శంకర్..విశాలాంధ్ర

K.మురళి కృష్ణ..99TV

నరేంద్ర..వార్త

సునీల్..N3

నర్సింహులు..HMTV

"కమిటి సభ్యులు"

మురళి.. TV 9

బాలకృష్ణ..ప్రజాశక్తి

మస్తాన్ రెడ్డి..సాక్షి

వెంకటేశ్వర్లు..ఆంధ్రప్రభ

రాజారావు..ETV

గయాజ్..R TV

రమేష్..CVR NEWS

మహేష్..ABN

రాజేష్...TV 5

దినకర్..మహా న్యూస్

ఆంధ్రజ్యోతి..అమర్

ఖాజా..V6

దేవ..10TV

నరేష్..ప్రైమ్ 9

మునీంద్ర ...Z TV

మల్లి కార్జున్..BRK

వెంకట్ నారాయణ..NTV

సురేంద్ర..BIG TV

మల్లి..స్వతంత్ర TV

లోకేష్..సాక్షి TV

సురేంద్ర..ఇండియన్ ఎక్స్ప్రెస్

సాగర్..I NEWS

Tags:    

Similar News