Nellore: ఏపీకి పెద్ద ఎత్తున రానున్న పరిశ్రమలు.. మంత్రి నారాయణ!

Nellore: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా సరికొత్త చరిత్ర సృష్టించబోతోందని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.

Update: 2026-05-04 07:33 GMT

Nellore: ఏపీకి పెద్ద ఎత్తున రానున్న పరిశ్రమలు.. మంత్రి నారాయణ!

నెల్లూరు: భారతదేశంలో వచ్చిన పరిశ్రమలలో 25 శాతం ఆంధ్ర ప్రదేశ్ కి మంజూరు అయ్యాయని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మూడో డివిజన్లోనిదస్తగిరి సాహెబ్ కాలనీ వద్ద 143 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కార్యక్రమానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... ఎప్పటినుంచో ఈ సమస్య ఉందని లేఅవుట్ ప్రకారం 30, 40 అడుగులు ఉండవలసిన రోడ్డు ఆక్రమణ వల్ల కుదించుకుపోయి 12 ,13 అడుగులకు మారిందని దీని విషయమై సమస్యలు తన దృష్టికి వచ్చాయని స్థానికులతో చర్చించి ,సంప్రదింపులు జరిపి 20 అడుగుల రోడ్డు ఏర్పాటుకు ఆమోదం వచ్చిందని ఆయన తెలిపారు. అన్ని రోడ్లను ఎండు నుంచి ఎండ్ వరకు నిర్మించే విధంగా ముఖ్యమంత్రి అనుమతితో చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

రానున్న మూడు నెలలలో దస్తగిరి సాహెబ్ కాలనీ వద్ద ఏర్పాటు చేయనున్న రోడ్డును పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కన్నా, ఎక్కువ పూర్తి చేయడం జరుగుతుందని ఈ విషయమే నగర ప్రజలు కొంత సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే జిఎస్టి వస్తుందని, తద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయని సంక్షేమ , అభివృద్ది పథకాలను మరింత పెంచవచ్చని ఆయన తెలిపారు.

రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ....

ఎప్పటి నుంచో సమస్యలు ఉన్న దస్తగిరి సాహెబ్ కాలనీ రోడ్డు విస్తరణ పనులు నేడు 143 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందన్నారు. 20 అడుగుల మేర రోడ్డును నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. 2014-2019 నాటికన్నా మంత్రి పొంగూరు నారాయణ ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరభ్యంతరంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News