Atmakur: నెల్లూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు.. భారీగా వాహనాల సీజ్!
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు టిడ్కో గృహాల్లో పోలీసుల కార్డెన్ సెర్చ్.
Atmakur: నెల్లూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు.. భారీగా వాహనాల సీజ్!
ఆత్మకూరు నెల్లూరు: వేసవి సెలవుల్లో చిన్నారులు నీటి ప్రమాదాలకు గురవుతుంటారని,ఇప్పటికే జిల్లాలో నలుగురు చిన్నారులు రెండు రోజుల వ్యవధిలో ఈతకోసం వెళ్లి నీటమునిగి చనిపోయారని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు సీఐ జి. గంగాధర్ సూచించారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, ఆత్మకూరు డీఎస్పీ కె. వేణుగోపాల్ సూచనలతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని టిడ్కో గృహాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. టిడ్కో గృహ సముదాయాల్లో ఇంటింటికీ వెళ్లి వారి ఆధార్ కార్డులను, చిరునామాలను నమోదు చేసుకున్నారు.
అనుమానిత వ్యక్తుల ను స్టేషన్ కుతరలించారు. గంజాయి, తదితర మాదకద్రవ్యాలు విక్రయించినా, కలిగి ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాల లైసెన్స్లను పరిశీలించారు. సరైన పత్రాలులేని 25 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సంగం సీఐ శ్రీనివాసులు రెడ్డి, వివిధ స్టేషన్ల ఎస్సైలు జిలానీ, అనూషా, శ్రీనివాసులు, రాజేష్, సూర్యప్రకాష్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.