Tamil Nadu: తమిళనాడు సీఎంగా రేపు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం: కూటమి మంత్రుల జాబితా సిద్ధం!

Tamil Nadu: టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Update: 2026-05-09 15:04 GMT

Tamil Nadu: తమిళనాడు సీఎంగా రేపు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం: కూటమి మంత్రుల జాబితా సిద్ధం!

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. టీవీకే (తమిళగ వెట్రి కళగం) అధినేత జోసెఫ్ విజయ్ రేపు (ఆదివారం) రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం రాజ్ భవన్‌కు వెళ్లిన విజయ్, తన కూటమి నేతలతో కలిసి గవర్నర్ విశ్వనాధ్ ఆర్లేకర్‌ను కలిశారు. సుమారు ఒక గంట 50 నిమిషాల పాటు గవర్నర్‌తో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక పత్రాలను అందజేశారు.

రేపు మధ్యాహ్నం 3:15 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. విజయ్‌తో పాటు మొత్తం 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

మంత్రివర్గ కూర్పు:

కూటమిలో భాగంగా మంత్రి పదవుల పంపకం ఇలా ఉండనుంది:

టీవీకే (TVK): 06 మంది మంత్రులు

కాంగ్రెస్ (Congress): 03 మంది మంత్రులు

గతంలో గవర్నర్ కార్యాలయం నుండి ఎదురైన కొన్ని భిన్నమైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి విజయ్ మరియు కూటమి నేతలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించారు. గవర్నర్‌ను ఆహ్వానించే ప్రొసీజర్ పత్రాలు, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంగీకార పత్రాలు (రిప్లై డాక్యుమెంట్స్) అన్నీ చేతికి వచ్చాకనే విజయ్ లోక్ భవన్ నుండి బయటకు వచ్చారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఆయన రాజ్ భవన్ వీడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం చెన్నై అంతటా విజయ్ అభిమానుల సందడి కనిపిస్తోంది. రేపు మధ్యాహ్నం జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News