Annamalai: అన్నామలై రాజీనామాను ఆమోదించిన బీజేపీ అధిష్టానం.. తమిళ పాలిటిక్స్‌లో సరికొత్త ట్విస్ట్!

Annamalai: తమిళనాడు రాజకీయాల్లో పెను భూకంపం. బీజేపీకి ఐపీఎస్ మాజీ అధికారి కె. అన్నామలై రాజీనామా చేశారు.

Update: 2026-06-05 05:28 GMT

Annamalai: అన్నామలై రాజీనామాను ఆమోదించిన బీజేపీ అధిష్టానం.. తమిళ పాలిటిక్స్‌లో సరికొత్త ట్విస్ట్!

Annamalai: దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (BJP)ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఫైర్‌బ్రాండ్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై (K. Annamalai) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధిష్టానం కూడా తక్షణమే ఆమోదించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై అసంతృప్తితో ఉన్న అన్నామలై, ఇప్పుడు పూర్తిగా కమలం గూటి నుంచి బయటకు రావడం జాతీయ రాజకీయాల్లో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బీజేపీని వీడిన అన్నామలై తమిళనాడులో ద్రవిడ పార్టీలకు దీటుగా తన సొంత ఇమేజ్‌తో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు చెన్నై రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన పెట్టబోయే కొత్త పార్టీకి సంబంధించి రెండు ఆసక్తికరమైన పేర్లు ప్రస్తుతం స్క్రీన్‌పైకి వచ్చాయి.

తమిళగ మక్కల్‌ కళగం (Tamilaga Makkal Kazhagam), తమిళగ మక్కల్‌ కట్చి (Tamilaga Makkal Katchi) ఈ రెండింటిలో ఒక పేరును ఆయన త్వరలోనే అధికారికంగా ప్రకటించి, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, అన్నామలై ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘వియ్‌ లీడర్స్‌’ (We Leaders) అనే సామాజిక ట్రస్టు కార్యకలాపాలను రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరింపజేయాలని భావిస్తున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా తమిళనాడులోని యువతను, మేధావులను పెద్ద ఎత్తున ఒకే తాటిపైకి తెచ్చి.. దీన్ని ఒక శక్తివంతమైన రాజకీయ ఉద్యమంగా మార్చాలనే ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సరికొత్త రాజకీయ వ్యూహాలతో, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా అన్నామలై తమిళ జనం ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ద్రవిడ రాజకీయాల కోట అయిన తమిళనాడులో అన్నామలై ఒంటరి పోరు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Full View


Tags:    

Similar News