Congress: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్ విడుదల.. రాహుల్ గాంధీ కోటరీకే పెద్దపీట..

Congress: దేశవ్యాప్తంగా జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏడుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది.

Update: 2026-06-05 05:37 GMT

Congress: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్ విడుదల.. రాహుల్ గాంధీ కోటరీకే పెద్దపీట..

Congress: దేశ వ్యాప్తంగా రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఏడుగురు అభ్యర్ధులను ప్రకటించింది. పార్టీ సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్తయ, సంస్థాగతంగా పని చేసిన నేతలకు ప్రాధాన్యత కల్పిస్తూ పెద్దల సభకు అభ్యర్ధుల జాబితా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటాగా ఉన్న కర్ణాటక నుంచి ముగ్గురు ప్రముఖ నేతలను పార్టీ బరిలోకి దింపింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేర్, మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖ నేత మన్సూల్ అలీఖాన్ కర్ణాటక నుంచి అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు.

ఇక మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు అవకాశం కల్పించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా మీనాక్షీ నటరాజన్ గుర్తింపు పొందారు. మాల్వా ప్రాంతానికి చెందిన మీనాక్షీ నటరాజన్ కు అవకాశం కల్పించారు.

రాజస్థాన్ నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు నీరజ్ డాంగీకి మరోసారి అవకాశం దక్కింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయనపై పార్టీ అధిష్టానం మరోసారి విశ్వాసం వ్యక్తం చేసింది. తమిళనాడు నుంచి కాంగ్రెస్ డేటా అండ్ అనలిటిక్స్ విభాగం చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తికి రాజ్యసభ టికెట్ కేటాయించారు. రాహుల్ గాంధీకి సన్నిహిత విధాన సలహాదారుడిగా ప్రవీణ్ చక్రవర్తికి గుర్తింపు ఉంది. జార్ఖండ్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి, కమ్యూనికేషన్స్ విభాగం సీనియర్ నేత ప్రణవ్ ఝూ కు అవకాశం లభించింది. మీడియా నిర్వాహణ, సంస్థాగత వ్యవహారాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం కల్పించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Full View


Tags:    

Similar News