Fire Accident: గంటపాటు నరకయాతన.. బస్సులోనే కాలి బూడిదైన ఏడుగురు ప్రయాణికులు!
Fire Accident: రాజస్థాన్ లోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. దౌసా జిల్లాలో స్లీపర్ బస్సు - ట్రక్కు ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగి ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
Fire Accident: గంటపాటు నరకయాతన.. బస్సులోనే కాలి బూడిదైన ఏడుగురు ప్రయాణికులు!
Fire Accident: రాజస్థాన్‌లో ఘోరప్రమాదం జరిగింది. ఢిల్లీృ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కు-బస్సు ఢీకొన్నాయి. మంటలు అంటుకుని ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దౌసా జిల్లా కొల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారాపుర దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సు వేగంగా వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. వెంటనే రెండు వాహనాల్లో ఒక్క సారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే బస్సు-ట్రక్కు పూర్తిగా దగ్దం అయ్యాయి.
ప్రమాదం జరిగిన తర్వాత గంట పాటు బస్సులోనే చ్కుకుకుపోయిన వారు రక్షించాలంటూ కేకలు వేశారు. అప్పటికా ఘటనా స్థలానికి చేరుకున్న స్తానికులు బస్సు కిటికిలు, తలుపులు పగులగొట్టి లోపల చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకు వచ్చారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోపల చిక్కుకున్న వారని బయటకు తీసుకు వచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే బస్సు మితిమీరిన వేగంతా వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రమాద కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌వేపై అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులు గంటపాటు బస్సులోనే నరకయాతన పడటాన్ని చూసిన స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. అయినప్పటికీ అంబులెన్స్, ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యం చేశాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో మంటలు విపరీతంగా వ్యాపించాయని చెబుతున్నారు.