Petrol And Diesel: బాంబు పేల్చిన కేంద్రం..పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక సుంకం

Petrol And Diesel: దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2026-07-01 01:54 GMT

Petrol And Diesel: బాంబు పేల్చిన కేంద్రం..పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక సుంకం

Fuel Shortage: పశ్చిమాసియా సంక్షోభం సెగలు పుట్టిస్తోంది.. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో ఒడిదుడుకులు భయపెడుతున్నాయి.. కానీ, భారతీయ వినియోగదారులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందిస్తూనే, దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఒక అద్భుతమైన వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగించింది.

దేశంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఎగుమతి సుంకం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి అంటే రేపటి నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. విదేశాలకు ఇంధనాన్ని తరలించి లాభాలు గడించాలనుకునే కంపెనీలకు బ్రేక్ వేస్తూ, ప్రభుత్వం లీటరుపై విధించిన సుంకాలు ఇలా ఉన్నాయి. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ. 4, డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 8.5, విమాన ఇంధనంపై లీటరుకు రూ. 7.5 చొప్పున పెంచడం జరిగింది.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు, దేశీయ చమురు సంస్థలు స్థానిక మార్కెట్లో అమ్మడం కంటే విదేశాలకు ఎగుమతి చేసి ఎక్కువ లాభాలు అర్జించడానికి మొగ్గు చూపుతాయి. దీనివల్ల దేశంలో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎగుమతులపై అదనపు బాదుడు విధించడం ద్వారా, కంపెనీలు విదేశాలకు పంపడం కంటే దేశీయ మార్కెట్లోనే ఇంధనాన్ని సరఫరా చేసేలా ప్రభుత్వం చెక్ పెట్టింది. భారతదేశం ఎప్పుడూ తన మిత్రదేశాల కష్టసుఖాల్లో తోడుంటుందని ఈ నిర్ణయంతో మరోసారి నిరూపితమైంది.

ఈ ప్రత్యేక ఎగుమతి సుంకం నుంచి మన పొరుగు దేశాలు, అత్యంత సన్నిహిత దేశాలకు కేంద్రం పూర్తి మినహాయింపు ఇచ్చింది. అంతర్జాతీయంగా సంక్షోభం ఉందనగానే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.మళ్లీ పెట్రోల్ ధరలు పెరుగుతాయా? అని. కానీ కేంద్ర ప్రభుత్వం భరోసానిచ్చింది. దేశీయ అవసరాల కోసం వినియోగించే పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతమున్న ఎక్సైజ్ సుంకంలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. అంటే, దేశీయంగా ఇంధన ధరలు యథాతథంగానే ఉంటాయి.

Tags:    

Similar News