Suryapet: సూర్యాపేటలో సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు

Suryapet: సూర్యాపేటలో ఘనంగా సర్వార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి. పాపన్న ఆశయ సాధనకు కృషి చేయాలని సంఘం నేతల పిలుపు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు.

Update: 2026-08-18 17:08 GMT

Suryapet: సూర్యాపేటలో సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు

సూర్యాపేట: తొలి బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రామమూర్తి గౌడ్ పిలుపునిచ్చారు.

మంగళవారం జిల్లా కేంద్రంలో గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాపన్న 376 సంవత్సరాల క్రితమే బహుజన రాజ్య స్థాపన కోసం పోరాడారని తెలిపారు. 12 వేల సైన్యాన్ని తయారు చేసి అనేక కోటలు నిర్మించి, సబండ వర్గాలను కలుపుకొని బహుజనులకు అధికారం ఉండాలని చాటిచెప్పిన గొప్ప బహుజన చక్రవర్తి అని కొనియాడారు. పాపన్న ఒక వ్యక్తి కాదు, అది ఒక శక్తి అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడిచినా బహుజనుల్లో ఐక్యత లేకపోవడం వల్ల ఆశయాలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి, అధికారం, ఆత్మగౌరవం దిశగా బహుజన రాజ్యాధికార స్థాపనే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. బహుజనులు సంఘటితమై చైతన్యం తెచ్చుకున్నప్పుడే బహుజన రాజ్య స్థాపన సాధ్యమవుతుందని అన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనం తెలియాలంటే ఆయన జీవిత చరిత్ర, పోరాట స్ఫూర్తిని గ్రామీణ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు తీసుకెళ్లాలని, పాఠ్యాంశాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దేశ జనాభాలో బీసీలు 56 శాతం ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ రంగాల్లో, చట్టసభల్లో కనీసం 10 శాతం రిజర్వేషన్లు కూడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. దేశ సంపదను 10 కుటుంబాలే శాసిస్తున్నాయని వాపోయారు. బహుజన కులాల అభివృద్ధికి, వారిలో చైతన్యం నింపేందుకు గౌడ సంక్షేమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చిత్తలూరి యాదగిరి గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న కోఆపరేటివ్ చిట్టి ప్రధాన కార్యదర్శి పబ్బతి వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు తండ అంజయ్య గౌడ్, అల్లాడి సత్యనారాయణ గౌడ్, జలగం పురుషోత్తం గౌడ్, గోపగాని సుధాకర్ గౌడ్, అంతటి వెంకన్న గౌడ్, బింగి లక్ష్మయ్య గౌడ్, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు లింగాల రవి గౌడ్,

సురభి శ్రీధర్ గౌడ్, డివిజన్ గౌరవాధ్యక్షుడు చౌగోని వెంకయ్య గౌడ్, మాజీ ఎంఈఓ తండు వెంకటనారాయణ గౌడ్, జయ స్కూల్ లక్ష్మయ్య గౌడ్, సూర్య గౌడ్, మండవ సైదులు, వెంకటేశ్వర్లు, గౌడ్ అప్పాల సైదులు గౌడ్, గుండగాని రమేష్ గౌడ్, గిలకత్తుల సైదులు గౌడ్, వేణు, సోమగాని రమేష్ గౌడ్, అనంతుల మల్లేష్ గౌడ్, రాచకొండ సురేష్ గౌడ్, మద్దెల చంద్రమౌళి గౌడ్, వనం యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News