Suryapet: సూర్యాపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు!

Suryapet: కలెక్టరేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాపన్న పోరాట పటిమను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ తేజస్ పిలుపునిచ్చారు.

Update: 2026-08-19 03:39 GMT

Suryapet: సూర్యాపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు!

Suryapet: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు.

మంగళవారం సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాపన్న చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా ప్రజల్లో పోరాట పటిమకు దశ, దిశ నిర్దేశం చేశారని అన్నారు. అట్టడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సమాజంలోని సమస్యలపై దృష్టి పెట్టి మార్పు తీసుకురావాలని, ప్రజల్లో స్ఫూర్తి నింపాలని సూచించారు. దీనికి చదువే ప్రధాన పరిష్కారమని, విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, కొత్త తరానికి బలమైన జీవితాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. అభివృద్ధి పనులు, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. సర్దార్ సర్వాయి పాపన్న చేసిన మంచి పనులను పిల్లలకు చెప్పి వారిలో స్ఫూర్తి నింపాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, డిఎం అండ్ హెచ్ఓ వెంకటరమణ, ఎస్సీ సంక్షేమ అధికారి లత, టిఎన్జీవో జిల్లా సెక్రెటరీ దున్న శ్యామ్, బీసీ సంఘం నాయకులు, మీడియా ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News