Suryapet: సూర్యాపేటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 'రాఖీ ఆటో'!

Suryapet: సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో రాఖీలతో అలంకరించిన 'రాఖీ ఆటో' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తుచేస్తూ ప్రశంసలు అందుకుంటోంది.

Update: 2026-08-28 08:57 GMT

Suryapet: సూర్యాపేటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 'రాఖీ ఆటో'!

Suryapet: కనిపించిన ఆ దృశ్యం ప్రయాణికులనే కాదు, చూసే ప్రతి ఒక్కరి మనసునూ తాకుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో క్రమంగా తగ్గుతున్న ఆత్మీయతలకు, మరుగున పడుతున్న రక్తసంబంధాలకు నిలువెత్తు మేల్కొలుపులా నిలుస్తోంది ఓ ఆటో.

సూర్యాపేట కొత్త బస్టాండ్ ఆవరణలో రాఖీలతో అందంగా అలంకరించిన ఓ ఆటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం ఉపాధి కోసం, పొట్టకూటి కోసం మాత్రమే చక్రాలు తిప్పడం లేదు ఈ ఆటో డ్రైవర్. అనురాగాలు, ఆప్యాయతలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో... అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల బంధాలను మరింత దగ్గర చేసేందుకు, మనసులను కలిపేందుకు గడప గడపకు పయనం అవుతున్నట్లు అనిపిస్తోంది.

ఆ ఆటో నిండా వేలాడుతున్న ప్రతి రాఖీ వెనుకా ఓ సోదరి నిండైన ప్రేమ దాగి ఉంది. తన సోదరుడు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకునే నిస్వార్థమైన మనసు ఉంది. ప్రతి రాఖీ వెనుకా సోదరి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తాపత్రయపడే సోదరుడి కొండంత భరోసా ఉంది.

కనిపించే రాఖీల అలంకరణ వెనుక కంటికి కనిపించని అనుబంధాల తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని ఈ ఆటో గుర్తుచేస్తోంది. మారుతున్న బంధాలను ఆప్యాయతతో కలిపేందుకు మీ ఇంటి ముందుకు వస్తున్న ఈ 'రాఖీ ఆటో' సూర్యాపేట పట్టణంలో బంధాల విలువును చాటిచెబుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Tags:    

Similar News