Nalgonda: రైస్ మిల్‌పై పోలీసుల దాడి, 21 టన్నుల అక్రమ పీడీఎస్ బియ్యం సీజ్

Nalgonda: మిర్యాలగూడ మండలం అవంతిపురం శివారులోని రైస్ మిల్‌పై పోలీసులు ఆకస్మిక దాడి చేసి, 21 టన్నుల అక్రమ పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు.

Update: 2026-08-27 16:12 GMT

Nalgonda: రైస్ మిల్‌పై పోలీసుల దాడి, 21 టన్నుల అక్రమ పీడీఎస్ బియ్యం సీజ్

నల్గొండ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం శివారులో అక్రమ PDS బియ్యం దందా గుట్టురట్టైంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆగ్రో ప్రొడక్ట్స్ రైస్ మిల్‌పై మిర్యాలగూడ రూరల్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.

ఈ తనిఖీల్లో 420 సంచుల్లో నిల్వ ఉంచిన 21 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేదల బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, మిల్లులో పాలిష్ చేసి కొత్త బస్తాల్లో మార్కెట్‌కు తరలించేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

రవాణాకు ఉపయోగిస్తున్న ఐషర్ డీసీఎంను సీజ్ చేసి, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అక్రమ దందాపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Tags:    

Similar News