Kurnool: శ్రీశైలం నీటి తరలింపును ఆపాలని రాయలసీమ సాధన సమితి డిమాండ్

Kurnool: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి తరలింపును తక్షణమే నిలిపివేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామి రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2026-08-27 13:14 GMT

Kurnool: శ్రీశైలం నీటి తరలింపును ఆపాలని రాయలసీమ సాధన సమితి డిమాండ్

కర్నూలు: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు నీటి తరలింపు తక్షణమే నిలిపివేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామి రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ కు అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నీటి తరలింపును తక్షణమే నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఎస్. కబీర్ బాషను రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు కలిసి జల సమస్యలను విన్నవించారు. ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుతం నీటి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని దశరథరామి రెడ్డి ఇంజనీర్ ను కోరారు. శ్రీశైలం జలాశయం లోని నీటిని రాయలసీమ అవసరాలకు ముందుగా భద్రపరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.

శ్రీశైలం నుంచి తెలంగాణలోని విద్యుత్ కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్ కు చేరే నీటిని ఉభయ రాష్ట్రాలు వినియోగించుకుంటాయని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొనడం.... రాయలసీమ అవసరాలను పరిగణలోకి తీసుకోని ప్రభుత్వ అనాలోచిత నీటి నిర్వహణ విధానాన్ని నష్టం చేస్తుందని బొజ్జా దశరథ రామి రెడ్డి విమర్శించారు.

Tags:    

Similar News