Nalgonda: నేపాల్ జలప్రళయంలో నల్లగొండ మహిళ గల్లంతు!
Nalgonda: ఆస్ట్రేలియాలో స్థిరపడిన నల్లగొండ జిల్లా వాసి కందిమల్ల సుహాసిని రెడ్డి నేపాల్ వరదల్లో గల్లంతయ్యారు. బంధువుల్లో తీవ్ర ఆందోళన.
Nalgonda: నేపాల్ జలప్రళయంలో నల్లగొండ మహిళ గల్లంతు!
Nalgonda: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో నల్లగొండ జిల్లాకు చెందిన మహిళ ఒకరు గల్లంతయ్యారు. చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కందిమల్ల సుహాసిని రెడ్డి (42) కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్మించిన నూతన గృహప్రవేశం కోసం ఈ నెల 19న ఆమె భారత్‌కు వచ్చారు. అనంతరం 23న విహారయాత్ర నిమిత్తం నేపాల్‌కు వెళ్లారు.
నేపాల్‌లో ఒక్కసారిగా విరుచుకుపడిన భారీ వరదల వల్ల సుహాసిని రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితురాలికి భర్త సంజీవరెడ్డి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె క్షేమంగా తిరిగిరావాలని స్వగ్రామంలో బంధువులు, గ్రామస్థులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.