Nakrekal: నకిరేకల్‌లో ఘనంగా ఎస్‌ఐఆర్ రెండో విడత శిక్షణ శిబిరం!

Nakrekal: పట్టణంలో ఎస్‌ఐఆర్ రెండో విడత ప్రక్రియ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Update: 2026-08-21 01:26 GMT

Nakrekal: నకిరేకల్‌లో ఘనంగా ఎస్‌ఐఆర్ రెండో విడత శిక్షణ శిబిరం!

Nakrekal: నకిరేకల్ పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు నకిరేకల్ నియోజకవర్గ స్థాయి SIR రెండవ విడత ప్రక్రియ శిక్షణ శిబిరం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు.

శిక్షణలో భాగంగా SIR రెండవ విడతలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితా పరిశీలన, వివరాల సేకరణ అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ "ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలి" అని అన్నారు.

పారదర్శకతకు ప్రాధాన్యత

SIR ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఓటు హక్కు ప్రాముఖ్యత

"ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనది. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే దిశగా అధికారులు, BLAలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి" అని ఎమ్మెల్యే కోరారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో ERO లెవల్ కోఆర్డినేటర్ చామల శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు పూజర్ల శంభయ్య *, నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, సంబంధిత *BLAలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News