Suryapet: మఠంపల్లి మండలంలో ఆర్‌అండ్‌బీ డబుల్ రోడ్ల ప్రారంభోత్సవం!

Suryapet: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లీపురంలో రూ.12 కోట్లతో నిర్మించిన అమరవరం–కొత్త తండా డబుల్ రోడ్డును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

Update: 2026-08-20 14:58 GMT

Suryapet: మఠంపల్లి మండలంలో ఆర్‌అండ్‌బీ డబుల్ రోడ్ల ప్రారంభోత్సవం!

సూర్యాపేట: మఠంపల్లి మండలం అల్లీపురం లో రూ 12 కోట్లతో అమరవరం నుండి కొత్త తండా వరకు R&B డబుల్ రోడ్లకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లా ఎస్పీ కే నరసింహ తో కలసి రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ప్రారంభోత్సవాలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలను కలుపుతూ తారు రోడ్లు వేయించడం జరుగుతుందని, గ్రామాలలో కొత్తగా వేసిన తారు రోడ్లపై వ్యవసాయ పనులు నిమిత్తం ట్రాక్టర్లకు బిగించిన ఫుల్ వీల్స్, ఆఫ్ వీల్స్ తిప్పరాదని, ఇలా తిప్పడం వలన రోడ్లు తొందరగా పాడైపోతాయని కావున గ్రామ ప్రజలు రోడ్లను కలకాలం ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు.

అలాగే ఈ సంవత్సరం ఏలీనీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించినందున, రైతులు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని వ్యవసాయ శాఖ వారు సూచించిన సూచనలు పాటించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య, సర్పంచ్ జ్యోతి, అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News