Nalgonda: నల్గొండలో నూతన ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం!

Nalgonda: నల్గొండ హైదరాబాద్ రోడ్డులో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ కేంద్రంలో లభించే సేవలు, వేళల పూర్తి వివరాలు.

Update: 2026-08-20 07:29 GMT

Nalgonda: నల్గొండలో నూతన ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం!

Nalgonda: ప్రస్తుతం దేశంలో ప్రతి మనిషికి ఆధార్ చాలా ముఖ్యమని, అయితే ఆధార్ లో ఏమైనా సవరణలు , సమస్యలుంటే పరిష్కరించుకునేందుకు నల్గొండ జిల్లా కేంద్రం,హైద్రాబాద్ రోడ్ లో (పద్మా నగర్,పాల కేంద్రం వద్ద) నూతనంగా "ఆధార్ సేవా కేంద్రాన్ని" ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం, హైద్రాబాద్ రోడ్ లో (పద్మా నగర్,పాల కేంద్రం వద్ద) కేంద్ర యుఐడిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఆధార్ సేవా కేంద్రాన్ని” ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేంద్రంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషమని,తెలంగాణ లో ఇది 5 వ కేంద్రమని, ఈ కేంద్రం వల్ల జిల్లా ప్రజలతో పాటు,నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు ఆధార్ కు సంబంధించిన ఏ సమస్య ఉన్న పరిష్కరించుకోవచ్చని,ఈ కేంద్రం ఆదివారం కూడా తెరిచి ఉంటుందని తెలిపారు.

జిల్లాలో 100 సంవత్సరాలు పైబడిన వారు 200 మంది ఉన్నట్టు జిల్లా కలెక్టర్ ద్వారా తెలిసిందని, సాంకేతిక సమస్య వల్ల వారి పుట్టిన తేదీ తప్పుగా వచ్చిందని, అయితే సంబంధిత తహసిల్దార్ల ద్వారా వారిని నల్గొండ ఆధార్ సేవా కేంద్రానికి పిలిపించి వారి పుట్టిన తేదీ,వయసు సరిచేయాలని కలెక్టర్ కు సూచించారు.

పైసా ఖర్చు లేకుండా, హైదరాబాద్ వెళ్లే పని లేకుండా ఆధార్ లోని సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది చక్కటి అవకాశమని,అందువల్ల జిల్లా ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ యుఐడిఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రంలో ఆధార్ లో ఏమైనా తప్పులు ఉంటే హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా నల్గొండ పట్టణంలోని ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రానికొచ్చి నిర్దేశించిన రుసుము చెల్లించి సవరణలు చేసుకోవచ్చని తెలిపారు.

అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని ,5 సంవత్సరాల వయసు వరకు ఈ ఆధార్ సేవా కేంద్రంలో ఆధార్ కార్డు కు నమోదు చేసుకోవచ్చని, నిర్ణీత పని దినాలు, నిర్మిత వేళల్లో ఈ కేంద్రం పనిచేస్తుందని, అందువల్ల జిల్లాలోని ప్రజలు ఆధార్ సేవా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఈడీఎం దుర్గారావు, యూఐ డి ఐ ఆధార్ సేవ కేంద్రం ఏజెన్సీ ప్రతినిధి భారతి, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News