Nalgonda: న్యాయ, పోలీసు శాఖల సమన్వయంతోనే సత్వర న్యాయం జడ్జి పి. వసంత్!
Nalgonda: బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయ, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయం అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వసంత్ స్పష్టం చేశారు.
Nalgonda: న్యాయ, పోలీసు శాఖల సమన్వయంతోనే సత్వర న్యాయం జడ్జి పి. వసంత్!
నల్గొండ: బాధితులకు సత్వర న్యాయం చేకూర్చడంలో న్యాయ, పోలీసు, రెవెన్యూ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం అత్యంత ఆవశ్యకమని ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ పి. వసంత్ స్పష్టం చేశారు. శనివారం నల్గొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
న్యాయ, పోలీసు వ్యవస్థలు ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని, సంక్లిష్టమైన కేసుల పరిష్కారంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించేందుకు పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసును వేగంగా ఛేదించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలోని పోలీసు బృందాన్ని ఈ సందర్భంగా జడ్జి ప్రత్యేకంగా అభినందించారు.